తేల్చుకోమన్న ప్రేయసి: ప్రియుడి నోటికి విషం సీసా

ఆ సంఘటన సికింద్రాబాదులోని చిలకలగుడా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీనివాననగర్‌కు చెందిన పిఎల్వి సత్యనారాయణ (35), ఓ ప్రైవేట్ ఉద్యోగి. శ్రద్థ అనే మహిళతో అతనికి వివాహమైంది. వారికి పిల్లలు లేరు.
సత్యనారాయణకు తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే పనిచేస్తున్న జయతో పరిచయం ఏర్పడింది. ఇరువురు కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని జయ సత్యనారాయణపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఈ విషయంపై ఇరువురి మధ్య పలుమార్లు గొడవ కూడా జరిగింది.
సోమవారం రాత్రి గుర్తు తెలియని విషం బాటిల్‌తో సత్యనారాయణ ఇంటికి జయ వచ్చింది. పెళ్లి చేసుకుంటావా, విషం తాగమంటావా అంటూ బెదిరించింది. భార్య శ్రద్ధ ఎదుటే ఒత్తిడి చేయడం భరించలేని సత్యనారయాణ ఆమె తెచ్చిన విషం బాటిల్ లాక్కుని గొంతులో పోసుకున్నాడు. క్షణాల్లో నురగలు కక్కుతూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్య శ్రద్ధ అతన్ని ఆస్పత్రిలో చేర్చింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సత్యనారాయణ మరణించాడు. సత్యనారాయణ సోదరుడు గోవిందరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications