బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్: పరుసగా దాష్టీకం
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఐదుగురు యువకులు ఓ అమ్మాయిపై పదే పదే అత్యాచారం చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆ సంఘటన జరిగింది.
గుత్తి పట్టణంలోని ఓ కాలనీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఏడాది క్రితం ఆ కుటుంబంలో ఇంటి పెద్ద కూతురు వివాహం జరిగింది. ఆ సమయంలో ఫొటోలు తీసేందుకు వచ్చిన మరో కాలనీకి చెందిన మోసెస్ అనే యువకుడితో 15 ఏళ్ల రెండో కూతురికి పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయంతో యువకుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో మాయమాటలు చెప్పి అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో మోసెస్ స్నేహితులు నలుగురు కూడా బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చారు.
ఇటీవల అమ్మాయి పొట్ట పెరగడం గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్యులు అమ్మాయి ఏడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో బాధితురాలు తండ్రితో కలిసి సోమవారంనాడు పోలీసులను ఆశ్రయించింది. విషయాన్నంతా అమ్మాయి పోలీసులకు చెప్పింది. మోసెస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications