విద్యార్థిని ఆత్మహత్య: ఆగ్రహించిన విద్యార్థులు హాస్టల్ ఫర్నిచర్ ద్వంసం
గుంటూరు విద్యానగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెస్సార్ మ్యాట్రిక్స్ కళాశాల లో ఇంటర్ చదువుతున్న ప్రకాశం జిల్లా వనపర్రు కి చెందిన ఎన్.
గుంటూరు: గుంటూరు విద్యానగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెస్సార్ మ్యాట్రిక్స్ కళాశాల లో ఇంటర్ చదువుతున్న ప్రకాశం జిల్లా వనపర్రు కి చెందిన ఎన్. జయశ్రీ ఉదయాన్నే తన హాస్టల్ రూమ్ లో చున్నీ తో ఉరి వేసుకుంది.
తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ నిర్వాహకులకు తెలియ జేశారు. విషయం తెలుసుకున్న బందువులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మరణించిన తమ కుమార్తె ని చూసి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆగ్రహించిన బంధువులు హాస్టల్ లోని ఫర్నిచర్ ని ద్వంసం చేశారు.

కుర్చీలు, బల్లలు విరగగొట్టారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. పోలీసులు విషయం తెలుసుకుని పరిస్థితి ని చక్కదిద్దారు. కాగా, తమకు న్యాయం చేయాలని జయశ్రీ మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ హాస్టల్ హాస్టల్ వద్ద బందువులు ఆందోళనకు దిగారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications