గర్భగుడిలోనే పద్మావతి అమ్మవారి లక్ష్మీహారం లభ్యం
తిరుపతి: తిరుచానూరు పద్మావతి ఆలయంలో మూడు రోజుల క్రితం మాయమైన లక్ష్మీహారం గర్భగుడిలోనే లభ్యమైంది. మూలమూర్తికి అలకరించే లక్ష్మీకాసుల హారం మాయమవడం సంచలనం రేపింది. ఈ విషయాన్ని మూడు రోజులుగా గుట్టుగా ఉంచిన అధికారులు గర్భగుడిలోనే లక్ష్మీహారం లభ్యమైనట్లు ప్రకటించారు.
అమ్మవారి కంఠానికి నిత్యం ఉండే ఈ హారం బరువు 217గ్రాములు. ఈనెల 13 నుంచి జరిగే అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సమయంలో అమ్మవారి కంఠంలో కాసుల హారం లేదని గుర్తించిన సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పకుండా గుట్టుగా ఉంచారు. హారం ఎంతకీ లభించకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

దాంతో రహ్యస విచారణకు ఆదేశించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజు ఆలయంలో విధులు నిర్వహించిన అర్చకులను విచారించినప్పటికీ ఫలితం కనిపించలేదు. గురువారంనాడు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఉన్నతాధికారులు ఆలయానికి చేరుకుని అధికారులతో చర్చించారు.
అమ్మవారి బంగారు ఆభరణాలను పర్యవేక్షించే అధికారి నెల రోజులుగా వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో అర్చకులే బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. మొత్తం మీద, లక్ష్మీహారం గర్భగుడిలోనే లభ్యం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications