గోదావరిలో తేలిన లెక్క, ఆశలు గల్లంతు - ఫలితం ఫిక్స్..!!
ఏపీలో ఎన్నికల అంచనాలపై స్పష్టత వస్తోంది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. జూన్ 4న పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. కానీ, లోలోపల మాత్రం టెన్షన్ వెంటాడుతోంది. ఈ సారి ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నేతలు ప్రధానంగా గోదావరి జిల్లాల పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్ సరళి గమనించిన తరువాత ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేలింది. ఫలితం పైన దాదాపు క్లారిటీ వస్తోంది.
మారుతున్న లెక్కలు
ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరిలో మెజార్టీ సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ గోదావరిలో మెజార్టీ సీట్ల గెలుపు పైన భారీ అంచనాలు పెట్టుకుంది. చివరి నిమిషం వరకు అభ్యర్దుల్లో మార్పులు చేసింది. జగన్ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా సామాజిక వర్గాలనే నమ్ముకొని సీట్లు..ఎన్నికలు చేసారు. గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సారి పవన్ కల్యాణ్ ప్రభావంతో మెజార్టీ సీట్లు సాధించాలని చంద్రబాబు భావించారు. వైసీపీకి ఇక్కడ ఒక్క సీటు రానీయమని పవన్ శపథం చేసారు.

పోలింగ్ సరళితో క్లారిటీ
కానీ, పోలింగ్ ముగిసింది. పూర్తి స్థాయి కసరత్తు తరువాత ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారనేది పార్టీ ముఖ్యులకు స్పష్టత వచ్చింది. అంచనాలు తప్పినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలు తమకు తిరుగులేదని నమ్మకం పెట్టుకున్న నియోజకవర్గాల్లోనూ ఫలితం తారుమారు అయినట్లు తేల్చారు. రెండు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించటం ద్వారా అధికారానికి దగ్గర కావాలనేది కూటమి నేతల వ్యూహం. కానీ, జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాలు కొంత మేర ఫలించినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. స్థానికేతరులకు గోదావరిలో సీట్లు ఇవ్వటం కొంత మేర ఒక ప్రధాన పార్టీకి ఒక పార్లమెంట్ మొత్తంలో నష్టం చేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

ఏకపక్షంగా కాదు
అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైన మరో ప్రధాన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ కూటమి కంటే బాగా వెనుకంజలో ఉందనే లెక్కలు వినిపిస్తున్నాయి. అయితే...అనూహ్యంగా గోదావరి జిల్లాల్లోని ఎంపీల స్థానాల్లో మాత్రం క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు నిర్దారణకు వచ్చారు. అది ఎవరికి నష్టం చేస్తుందనేది టెన్షన్ పెంచుతోంది. ఇక..రెండు గోదావరి జిల్లాలో ఒక ప్రధాన పార్టీ అంచనాలకు మించి సామాజిక లెక్కలతో సక్సెస్ అయిందని చెబుతున్నారు. మరో జిల్లాలో మాత్రం ఆ లెక్కలు సక్సెస్ కాలేదనే వాదన ఉంది. అయితే, ఏకపక్షంగా గోదావరి జిల్లాల్లో ఫలితం మాత్రం ఉండటంత లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో..తుది ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications