రూ.4.5కోట్ల ఆభరణాలతో ధనలక్ష్మిగా విశాఖ అమ్మవారు: 2.5కోట్ల నగదుతో అలంకరణ
విశాఖపట్నం: దసరా నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని బంగారం, కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వందేళ్ల చరిత్ర కలిగిన కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఉన్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా పర్వదినం సందర్భంగా ఆదివారం అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు పట్టుచీర, సుమారు రూ.4.5కోట్ల నగదుతో అలంకరించారు. అలాగే 4కిలోల బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన నగదులో రూపాయి నుంచి రూ.2వేల వరకు నోట్లు, నాణేలు ఉన్నాయి.

బంగారు ఆభరణాలు, చీరతోపాటు బంగారు బిస్కెట్ల నడుమ అమ్మవారిని కొలువుదీర్చారు. నగరంలో ఉన్న 200మంది భక్తులు ఈ ఆభరణాలను సమకూర్చారు. కాగా, అమ్మవారికి అలంకరించిన నగదును పేద ప్రజల కోసం ఆలయ కమిటీ ఖర్చు చేయనుందని సమాచారం. అయితే, దీనిపై ఆలయ కమిటీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications