ఏపీ రైతులకు శుభవార్త.. వారికి 100శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నలకు మేలు చేసే అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100% రాయితీ మీద సూక్ష్మ సేద్య పరికరాలు అందించడానికి నిర్ణయించింది.

రైతులకు రాయితీపై 2.18 లక్షల రూపాయల వ్యవసాయ పరికరాలు
రాష్ట్రంలో గరిష్టంగా ఐదు ఎకరాల వరకు 2.18 లక్షల రూపాయలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వ్యవసాయ సహకార శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో భాగంగా ఈ పథకానికి సంబంధించిన రాయితీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. 2025 2026 సంవత్సరంలో రైతులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల సబ్సిడీ వివరాలను తెలియజేశారు.

Good news for AP farmers Agricultural equipment at 100 percent subsidy for them

వారికి 100% డ్రిప్ పరికరాలపై రాయితీ
ఎస్సీ, ఎస్టీలలో చిన్న, మధ్యతరహా రైతులకు ఐదు ఎకరాల వరకు 100% డ్రిప్ పరికరాలను రాయితీగా ఇస్తున్నట్టు తెలిపారు. ఇక మిగిలిన చిన్న, మద్యస్థ రైతులకు 90 శాతం రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఐటీడీఏ పరిధిలో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, కోస్తా జిల్లాలలో ఐదు నుండి పది ఎకరాల మధ్యస్థ రైతులకు 70 శాతం ఇవ్వనున్నారు.

సబ్సిడీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా
ఇక రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులు, పెద్ద రైతులకు 50% సబ్సిడీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇక స్ప్రింక్లర్లపై అన్ని కేటగిరీల రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు ఇక ఈ సబ్సిడీ లో 27% నుంచి 33% కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా 17% నుంచి 67% వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

రైతు సేవా కేంద్రాల వద్ద పూర్తి సమాచారం
రైతు సేవ కేంద్రాల వద్ద రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో భాగంగా ఇస్తున్న సూక్ష్మ సేద్య పరికరాల సబ్సిడీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
ఇదిలా ఉంటే 2022లో వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రకటించిన ఈ పథకాన్ని 2022- 2023, 2023 -2024 సంవత్సరాలలో నామమాత్రంగా అమలు చేశారు. ఈ పథకం అమలు చేయకుండా 1150 కోట్ల మీద బకాయిలు పెట్టారనే విమర్శలు కూడా వైసిపి ప్రభుత్వం పై ఉన్నాయి. కాగా ఈ పథకాన్ని ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేసే దిశగా అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+