చిరంజీవి అభిమానులకు అదిరిపోయే వార్త

తాజాగా విడుదలైన భోళాశంకర్ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసింది. ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా అని ప్రకటన రాగానే నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వద్దంటూ వేల సంఖ్యలో కామెంట్లు పెట్టారు. కానీ చిరంజీవి మాత్రం మెహర్ రమేష్ మీద నమ్మకం ఉంచి చిత్రం చేశారు. ఆ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచి చిరంజీవినే కాకుండా ఆయన అభిమానులకు కూడా పూర్తి నిరాశపరిచింది.

చిరంజీవికి తమ్ముడు వరుస అవడం, చిరు వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించడంతో ఒక అన్నయ్యగా కెరీర్ ను గాడిలో పెడదామని చిరంజీవి భావించారు. కానీ వేదాళం సినిమాను అలాగే తీసినా మినిమమ్ గ్యారంటీ లభించేదని, అలా కాకుండా మార్పులు చేర్పులంటూ అర్థం పర్థంలేని కామెడీ సన్నివేశాలను పెట్టి సినిమాను కంగాళీగా తీశారంటూ అభిమానులు మెహర్ రమేష్ మీద మండిపడుతున్నారు.

good news for chiranjeevi fans

చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇద్దరూ ఒకే చిత్రంలో నటించడంవల్ల వచ్చిన హైప్ ను ఆ సినిమా సరిగా వినియోగించుకోలేకపోయింది. ఇప్పటికీ చిరంజీవి పలు సందర్భాల్లో, ఇంటర్వ్యూల్లో ఆచార్య డైరెక్టర్ కొరటాల శివమీద పరోక్షంగా విమర్శలు గుప్పిస్తుంటారు. భోళాశంకర్ తర్వాత ఏ దర్శకుడి దర్శకత్వంలో నటించాలనే స్పష్టతకు చిరంజీవి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

బింబిసార్ దర్శకుడు వశిష్ట అని, కల్యాణ్ కృష్ణ కురసాల అని, మురుగదాస్ అని వార్తలు వస్తున్నాయి. తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఈ వార్తలో ఎంత నిజం ఉందనే విషయాన్ని ఈనెల 22వ తేదీన తెలియజేబోతున్నారు. తండ్రీ, కొడుకులు కలిసి ఇండస్ట్రీ హిట్ సినిమాను ఇస్తారేమో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+