వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jobs:ఏపీలో నేడే ఉద్యోగాల భర్తీ ప్రకటన: 10 వేలకు పైగా పోస్టులు.. ఏ శాఖలో ఎన్ని: వయో పరిమితి పైనా ..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏటా జనవరి 1 న ఉద్యోగాల ఖాళీలు..భర్తీ ప్రకటన ఉంటుందని సీఎం అప్పట్లోనే ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 పోస్టులు భర్తీ చేసారు. అందులో వార్డు సచివాలయాల ఉద్యోగాల తో పాటుగా అనేక రకాల పోస్టులు ఉన్నాయి. ఇక, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించి అధికారికంగా ముఖ్యమంత్రి జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఆరు లక్షలకు పైగా భర్తీ...
ఇందులో ప్రధానంగా వైద్య శాఖలో ఎక్కువ ఖాళీల భర్తీకి నిర్ణయించారు. అన్ని రకాల పోస్టుల భర్తీ బాధ్యతను ఏపీపీఎస్సీకి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను పెద్ద సంఖ్యలో నియమించేందుకు రంగం సిద్దమైంది. వచ్చే నెల నుండి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతీ నెలా... ఒక్కో శాఖలో ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ ఫిక్స్ చేసారు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.

Good news for the jobless: 10000 posts to be filled,AP govt to release the job calender for 2021-22

తాజా క్యాలండర్ ప్రకారం..
2021, జూలై నుంచి జరపనున్న ఉద్యోగ నిమామక వివరాలు...జూలై-2021 లో ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టులు 1,238 భర్తీ చేయనున్నారు. అదే విధంగా..ఆగస్టు-2021 లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ద్వారా 36 పోస్టులు భర్తీ చేస్తారు. సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450 భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450 నియామకం జరగనుంది. సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450 మందిని నియమించనున్నారు. అక్టోబర్‌ - 2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451 భర్తీ చేస్తారు. నవంబర్‌ -2021 పారామెడికల్‌ సిబ్బంది 5,251 భర్తీ చేయనున్నారు. డిసెంబర్‌ - 2021 నర్సులు 441 మందికి అవకాశం దక్కనుంది. జనవరి -2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240 మందిని భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి -2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000 భర్తీ చేయనున్నారు. మార్చి -2022 లో ఇతర శాఖలు ద్వారా 36 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దీంతో..మొత్తంగా 10,143 ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

English summary
AP govt has some good news for the jobless youth. CM Jagan will launch the job calendar for 2021-22 where 10000 posts will be filled in Education, Health and police departments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X