శుభవార్త: వారి ఖాతాలలో రూ.1000 కోట్లు వెయ్యనున్న సీఎం చంద్రబాబు!
పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు పెద్దగా సాగలేదు. ప్రస్తుతం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం నుండి రావలసిన ఆర్థిక వనరులను సాధించడానికి, ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేటాయించడానికి, పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించటానికి కష్టపడుతోంది.
1000 కోట్ల రూపాయలను విడుదల చేసి వారికి శుభవార్త
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం తాజాగా పోలవరం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు పంపిణీ చేయడానికి 1000 కోట్ల రూపాయలను విడుదల చేసి వారికి శుభవార్త చెప్పింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం నిర్వాసితులకు ఇచ్చే పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆయన పేర్కొన్నారు.

2027 డిసెంబర్ నాటికి పోలవరం నిర్మాణ పనులు పూర్తి
ప్రస్తుత కూటమి ప్రభుత్వం తిరిగి దాని గాడిలో పెట్టేందుకు విశేషంగా కృషి చేసిందని తెలిపారు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, ప్రాజెక్టు నిర్మాణం కన్నా ఆరు నెలల ముందే నిర్వాసితులకు కాలనీలను నిర్మించి ఇస్తామన్నారు.
3,385 కోట్ల రూపాయలను దారి మళ్లించిన జగన్
అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, వారు సంతోషంగా ఉండేలా చూస్తామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎటువంటి పరిహారాన్ని అందజేయలేదని, కేంద్రం ఇచ్చిన 3,385 కోట్ల రూపాయలను అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
పోలవరం నిర్వాసితుల ఖాతాలలో డబ్బులు జమ
ఏలూరు జిల్లా వేలేరుపాడులో పోలవరం నిర్వాసితులకు భూసేకరణ, పునరావాస పరిహారం కింద వెయ్యి కోట్ల రూపాయల పంపిణీని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోలవరం నిర్వాసితుల పరిహారం చెల్లింపులో ఏమాత్రం ఆలస్యం జరగదని, అందుకే నిర్వాసితుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. మరో 20 రోజుల్లో నిర్వాసితులు అందరికీ పరిహారం అందుతుందని, ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు.
సీఎం చంద్రబాబుకే ఈ ఘనత
ఎవరికైనా పరిహారం అందకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, అప్పుడు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఇక అధికారులు కూడా వారి ఖాతాలో డబ్బులు ఎందుకు జమకాలేదో పూర్తి వివరాలను నిర్వాసితులకు అందించాలని చెప్పినట్టుగా పేర్కొన్నారు. గతంలో 2016లో 700 కోట్లు, 2025 జనవరిలో 900 కోట్లు, ప్రస్తుతం 1000 కోట్లతో కలిపి మొత్తం నిర్వాసితులకు అందించిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
పరిహారం ఇప్పిస్తామని చెప్పే దళారులను గుర్తించి వారి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎస్పీకి కూడా ఇదే ఆదేశాలను ఇచ్చారు. మొత్తంగా పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పరిహారం అందిస్తూ శుభవార్త చెప్పింది.












Click it and Unblock the Notifications