భోగాపురం విమానాశ్రయంపై పండుగ లాంటి వార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో 2026 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ పనులలో దూకుడు కొనసాగుతుంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఊతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందని భావిస్తున్న వేళ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఎయిర్పోర్ట్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు విమానాశ్రయాల ద్వారా విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటే మరిన్ని విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్రం విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను నిర్మిస్తోంది.

జీఎంఆర్ ప్రతిపాదన..మంత్రుల కమిటీ వేసిన ప్రభుత్వం
భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టింది . ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతుండగా ఏపీ ప్రభుత్వం అదనంగా దీనికోసం 500ఎకరాల భూమిని కేటాయించనుంది. మొత్తం 2023ఎకరాలలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు సాగుతున్నాయి. అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మరో 500ఎకరాల భూమిని కేటాయించాలని జిఎంఆర్ కంపెనీ ప్రతిపాదించగా ఈ ప్రతిపాదనను పరిశీలించడం కోసం ఏపీ ప్రభుత్వం మంత్రులకమిటీని ఏర్పాటు చేసింది.
మంత్రుల కమిటీ భేటీ.. 500 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయం
ఈ క్రమంలో నేడు సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం కోసం అదనంగా 500 ఎకరాలు కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది అదనపు భూమి కేటాయింపు ద్వారా అభివృద్ధి తో పాటు ఆదాయం కూడా వస్తాయని మంత్రుల కమిటీ భావిస్తోంది.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి తలమానికంగా భోగాపురం ఎయిర్ పోర్టు
అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి తలమానికంగా మారేలా నిర్మాణం చేస్తున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ఎయిర్పోర్టు ద్వారా దేశ, విదేశీ ప్రయాణికుల రాకపోకలు సాగించడంతోపాటు ఫార్మా, ఆక్వా ఉత్పత్తిలో ఎగుమతులకు కూడా దోహదం చేస్తుందని భావిస్తున్నారు. వాణిజ్య రంగం, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన టీటీడీ!
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications