Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన టీటీడీ!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల పైన కొలువుతీరిన తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి ఎంతోమంది తిరుమలకు తరలి వెళ్తుంటారు. అటువంటివారు తిరుమలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి టిటిడి ఆలోచనలు చేస్తుంది.

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
సుదీర్ఘ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టిటిడి ఈ మేరకు శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సాధారణ రోజుల్లో కాకుండా ప్రత్యేక దినాలలో చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. సెలవు రోజుల్లోనూ, పండుగ రోజుల్లోనూ తిరుమలలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక వేసవి కాలంలో అయితే స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండడంతో భారీగా భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

TTD has given amazing good news to the devotees of Tirumala with permanant sheds

వేసవిలో టీటీడీ తాత్కాలిక ఏర్పాట్లు
దీంతో ఏప్రిల్, మే నెలలో తిరుమల కొండ భక్తుల రద్దీతో కిటికిటలాడుతూ కనిపిస్తుంది. ఇక వేసవిలో వేసవి తాపంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి టిటిడి అనేక ఏర్పాటు చేస్తుంది. వేసవిలో చలువ పందిళ్లు వేయించి, మాడవీధులలో కూల్ పెయింట్ వేయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది.

శాశ్వత ఏర్పాట్లకు టీటీడీ ఆలోచన
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల వంటి సమయంలో కూడా మాడవీధులలో ఎండ వేడి తట్టుకోలేని పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ తాత్కాలికంగా జర్మన్ షెడ్ లను, ఇతర షెడ్లను వేయిస్తూ భక్తులకు సౌకర్యాలను కల్పిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం భక్తులు రద్దీగా ఉండే సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్న టిటిడి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి రంగంలోకి దిగింది.

అవసరమైనప్పుడు ఉపయోగించుకునేలా శాశ్వత ఆటోమేటెడ్ షెడ్ లు
తాత్కాలిక షెడ్ ల కోసం మాడవీధులలో జర్మన్ షెడ్ల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి బదులు శాశ్వత ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటు చేయాలని టిటిడి నిర్ణయించింది. ఇక ఆ షెడ్లను అవసరమైనప్పుడు వినియోగించుకునేలా, అవసరం లేనప్పుడు ఆటోమేటిక్ గా అవే ముడుచుకునేలా నిర్మించాలని టిటిడి భావిస్తుంది.

తిరుమల మాడ వీధులలో సాంకేతిక సర్వే
ఇందులో భాగంగా తిరుమల ఆలయ మాడవీధులలో ఈ మేరకు సాంకేతిక సర్వేను ప్రారంభించారు. టిటిడి ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఇక ఈ సర్వే తర్వాత వచ్చే వేసవికాలంతో పాటు, బ్రహ్మోత్సవాలు వంటి వేడుకలకు శాశ్వత ప్రాతిపదికన షెడ్లు వేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+