ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇకపై ఈ స్టేషన్లలోనూ ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైళ్ళు.. వివరాలివే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికులకు సౌకర్యం కలిగించడం కోసం నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ ఏపీలో ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను రాష్ట్రంలోని మరో నాలుగు రైల్వేస్టేషన్లో ఆపాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వివరాలతో ఆయన ట్వీట్ చేశారు .
చాలాకాలంగా ప్రయాణికులు పలు ఎక్స్ప్రెస్ రైళ్ల విషయంలో రైల్వే శాఖకు అభ్యర్థనలను పెడుతున్నారు. ప్రయాణికుల నుండి వస్తున్న అభ్యర్థనల నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు స్టేషన్ ల పరిధిలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగుతాయని వివరాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఈ క్రమంలో వెల్లడించిన వివరాల ప్రకారం హౌరా పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ రైలు (12867/12868) రాజమండ్రిలో హాల్టింగ్ పాయింట్ ఇచ్చారు. అలాగే రామేశ్వరం భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు (20895/20896) రాజమండ్రిలో స్టాప్ ఇచ్చారు. అలాగే హుబ్లీ నుండి మైసూర్ వెళ్లే హంపి ఎక్స్ప్రెస్ (16591/16592) అనంతపురంలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఇక మరోవైపు సికింద్రాబాద్ నుండి రేపల్లె వెళ్లే ఎక్స్ప్రెస్ (17645/17646) సిరిపురంలో ఆగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ను నడపడానికి రైల్వే శాఖ సిద్ధమైంది.
భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ (20841 - 20842) వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని ఈనెల 12వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. దీంతో ఏపీలో రైల్వే శాఖ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ప్రజల రైలు ప్రయాణానికి మార్గాన్ని సుగమం చేస్తుందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications