• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్-భారీగా పెరిగిన ఆదాయం- దేశ సగటును మించి జీఎస్టీ వసూళ్లు..

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా కష్టాలు, ఆ తర్వాత కూడా ఆశించినంత స్ధాయిలో ఆదాయం పెరగక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి తాజాగా గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రం ఆదాయాలు ఎట్టకేలకు గాడిన పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉన్నట్లు ఇవాళ సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో అధికారులు తెలిపారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ సగటు వసూళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ సూచించారు.

 పెరిగిన ఏపీ ఆదాయం

పెరిగిన ఏపీ ఆదాయం

ఆదాయాన్నిచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో ఆదాయాల ప్రగతిని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. జీఎస్‌టీ వసూళ్లు సహా, ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయన్నారు. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. తద్వారా 94.47శాతం లక్ష్యం చేరుకున్నామన్నారు.

 పెరిగిన జీఎస్టీ వసూళ్లు

పెరిగిన జీఎస్టీ వసూళ్లు

ఈ ఆరునెలల్లోదేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అలాగే లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను కూడా తెలిపారు. ట్యాక్స్‌ ఇన్ఫర్మేషన్‌, ఇన్వెస్టిమెంట్‌ మేనేజిమెంట్‌ సిస్టంను అభివృద్ధి పరిచామని అధికారులు సీఎంకు వెల్లడించారు. హెచ్‌ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, ఇందులో సిబ్బందిని కూడా నియమించామన్నారు.
ఈ సందర్భంగా ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. లీకేజీలను అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్‌ ఇనిస్టిట్యూట్‌ల సహాయం తీసుకోవాలన్నారు. పన్ను చెల్లింపు దారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలన్నారు.

 మద్య నిషేధంపై జగన్

మద్య నిషేధంపై జగన్

గ్రామాల్లో మహిళా పోలీసులనుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలని, బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకురావాలన్నారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని ఆదేశించారు.అక్రమ మద్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

 రిజిస్ట్రేషన్ ఆదాయాలపై జగన్

రిజిస్ట్రేషన్ ఆదాయాలపై జగన్

రిజిస్ట్రేషన్‌ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ కమిటీలో ఐఏఎస్‌అధికారులు కృష్ణబాబు, రజత్‌ భార్గవ, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలని సీఎం ఆదేశించారు. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలన్నారు.అలాగే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నాన్‌ రిజిస్ట్రేషన్‌ పరిస్థితులను పూర్తిగా తొలగించాలని కూడా సూచించారు. ఇందులో ప్రొఫెసనల్‌ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలన్నారు. ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్‌ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలన్నారు.

 గనుల ఆదాయాలపై జగన్

గనుల ఆదాయాలపై జగన్

గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం కాగా, ఈ ఏడాది సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తంగా 19శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అంచనాగా వేశారు. మైనింగ్‌ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందినవారు మైనింగ్‌ ఆపరేషన్‌ కొనసాగించేలా చూడాలన్నారు. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయని సీఎం తెలిపారు. ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్ ఆపరేషన్‌ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతినెలా కూడా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్నదానిపై నిరంతరం సమీక్ష చేయాలన్నారు.

English summary
ap govt's revenues have crossed 94.47 percent of its target in first half of 2022-23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X