Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోయాం మోసం.. గడప గడపకూ జగన్ మోసం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి కవితలు; వ్యంగ్యాస్త్రాలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బాదుడే బాదుడు పేరుతో జగన్ సర్కారు హయాంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెంచిన పన్నులను, కరెంటు ఛార్జీలను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది. మరోపక్క గడపగడపకు ప్రభుత్వం పేరుతో, అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి చెప్పడానికి, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి వైసీపీ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది. ఇక ఈ క్రమంలో టిడిపి, వైసిపి నేతలు ఒకరు నిర్వహిస్తున్న కార్యక్రమంపై ఇంకొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఏపీలో పోటాపోటీగా వైసీపీ టీడీపీ కార్యక్రమాలు... ఒకరిపై ఒకరు విమర్శలు

ఏపీలో పోటాపోటీగా వైసీపీ టీడీపీ కార్యక్రమాలు... ఒకరిపై ఒకరు విమర్శలు

బాదుడే బాదుడు కార్యక్రమంలో జనం టిడిపి నేతలనే బాదుతున్నారు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తుంటే, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం గడపగడపకు చీత్కారంలా మారిందని టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. జగన్ పాలనపై జనాలు రెఫరెండం ఇస్తున్నారని వైసిపి ప్రజాప్రతినిధులను ప్రజలు అడ్డగిస్తూ నిరసన తెలియజేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతే కాదు జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయ్యిందని, జగన్ ను నమ్మి జనాలు మోసపోయారని మండిపడుతున్నారు.

 జగన్ పాలన వద్దు మహాప్రభో అంటూ గోరంట్ల ఆసక్తికర పోస్ట్

జగన్ పాలన వద్దు మహాప్రభో అంటూ గోరంట్ల ఆసక్తికర పోస్ట్


తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా జగన్ మోహన్ రెడ్డిని, జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలన వద్దు మహాప్రభో అని ప్రజలు వేడుకుంటున్నారు అంటూ పేర్కొన్నారు. పోయాం మోసం, చేశారు మోసం అంటూ ఓ సినిమాలో డైలాగ్ ను పోస్ట్ చేసి మీ పాలనకో దండం అంటున్న ప్రజలు, మళ్లీ మిమ్మల్ని ఓడించడం కోసం ఒక్క ఛాన్స్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారని ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఏపీ మొత్తం పోయాం మోసం అంటుందని, గడపగడపకు జగన్ మోసం అన్న చందంగా ప్రభుత్వ పనితీరు ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.

పోయాం మోసం అంటూ కవిత రాసిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

పోయాం మోసం అంటూ కవిత రాసిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి


ఏకంగా పోయాం మోసం'..'పోయాం మోసం..' అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా కవితనే రాశారు.
పోయాం మోసం.. పోయా మోసం
గడప గడప కి జగన్ మోసం..
పోయాం మోసం పోయాం మోసం..
ప్రతి ఇంటికి పన్నుల మోసం....
పోయాం మోసం పోయాం మోసం..
ప్రతి విద్యార్థి ఉద్యోగ మోసం...
పోయాం మోసం పోయాం మోసం...
ప్రతి అవ్వ తాత పెన్షన్ మోసం..
పోయాం మోసం పోయాం మోసం
మట్టి రోడ్డుల దందా మోసం..
పోయాం మోసం పోయాం మోసం
పోలవరం మోసం...
పోయాం మోసం..విశాఖ భూముల స్వాహా మోసం...
పోయాం మోసం పోయాం మోసం..
ఆవ భూముల్లో ఇళ్ల స్థలాల మోసం...!! అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

బాదుడే బాదుడులోనూ కరపత్రాలు, కొవ్వొత్తులు, అగ్గి పెట్టెలు పంపిణీ చేసిన గోరంట్ల

బాదుడే బాదుడులోనూ కరపత్రాలు, కొవ్వొత్తులు, అగ్గి పెట్టెలు పంపిణీ చేసిన గోరంట్ల


అంతేకాదు రాజమండ్రి రూరల్ హుకుంపేట లో జరిగిన "బాదుడే-బాదుడు" కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిత్యావసర వస్తువుల ధరల అసాధారణ పెరుగుదల, కరెంట్ చార్జీల పెంపు, ఆర్టీసీ బస్ చార్జీల పెంపు, చెత్త పై సుంకం ,వంట గ్యాస్ మరియు పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదల పై మండిపడ్డారు. సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అయిన పరిస్థితులను ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో టీడీపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన "బాదుడే-బాదుడు కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ హుకుంపేట లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాదుడే-బాదుడు కరపత్రాలు", కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఇంటింటికీ పంపిణీ చేసి టీడీపి ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+