ఏపీ అప్పులకు, గవర్నర్ కు మధ్య సంబంధం ఏంటి? మంత్రి బుగ్గన చెప్పాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోంది అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పులమయం కావడంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆఖరికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కూడా ఈ ప్రభుత్వం తమ స్వార్ధానికి బలి చేసిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

గవర్నర్ పేరుతో అప్పులు తేవటాన్ని టార్గెట్ చేసిన గోరంట్ల
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో అప్పులు తెచ్చి ఆయనను ఊబిలోకి నెట్టారని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గవర్నర్ కు అప్పులకు ఏం సంబంధం ఉందో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి గవర్నర్ అధికారులను పిలిచి మందలించే వరకు వచ్చిందని పేర్కొన్నారు. గవర్నర్ రిటైర్ అయ్యి రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా ప్రభుత్వం చేసిన తప్పులు,పాపాలు ఆయనను వదిలిపెట్టవని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించా

సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు చెల్లించలేక పోతున్నారు
కోట్లలో అప్పులు చేస్తూ సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు చెల్లించలేక పోతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్ని అప్పులు తెస్తున్నా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులకు ఏదో ధర్మం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గోరంట్ల బుచ్చయ్య.

జగన్ అప్పులు వాటి కోసం ఆర్దిక శాఖ తిప్పలు
కరోనా సమయంలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలను తాగుబోతుల నుంచి కొల్లగొట్టింది అని ఆరోపించిన గోరంట్ల బుచ్చయ్య, మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం, వాటిపై ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఇదిలా ఉంటే ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులు వాటి కోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గవర్నర్ పేరు అప్పుల ఒప్పంద పత్రంలో ... జగన్ సర్కార్ టార్గెట్
ఏపీలో ఆర్థికశాఖ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చర్చ జరుగుతుంది. ఏకంగా వివిధ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా 25 వేల కోట్ల రుణం తీసుకోవాలని ఏపీకి సంబంధించిన ఒప్పంద పత్రంలో గవర్నర్ హరిచందన్ పేరు చేర్చడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై గవర్నర్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను వివరణ ఇవ్వాల్సిందిగా కోరారని సమాచారం. మరోవైపు ఇలాంటి రుణ వ్యవహారాలలో గవర్నర్ పేరు చేర్చడాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications