ఎపి రాజధాని ఊహాచిత్రం విడుదల: నదుల అనుసంధానంపై బాబు
హైదరాబాద్/ రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణ ఊహాచిత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసిదంి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శనివారనాడు అమరావతికి సంబంధించి నాలుగు ఊహాచిత్రాలను రూపొందించింది. సింగపూర్ సంస్థలు ఎపి రాజధాని సీడ్ క్యాపిటల్ డిజైన్‌కు రూపకల్పన చేశారు.
ఎపి రాజధాని మాస్టర్ ప్లాన్ వ్యూతో పాటు సీడ్ క్యాపిటల్ భవన నమూనాలను ఎపి ప్రభుత్వం విడుదల చేసింది. చుట్టూ కృష్ణానది పరీవాహక ప్రాంతం, మధ్యలో సీడ్ క్యాపిటల్ ఉండే విధంగా సింగపూర్ ప్రభుత్వం డిజైన్ చేసింది. ఎపి రాజధాని మెట్రో రైలు, బిఆర్టీఎస్‌లను కూడా నిపుణులు డిజైన్ చేశారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని, సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకొని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

శనివారం రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో జరిగిన ‘రైతు కోసం' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడి సభలో బాబు ప్రసంగించారు.
నీరుంటేనే రైతులు నేలలో బంగారం పండిస్తారని, లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేస్తున్నామని ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రజల భాగస్వామ్య లేకుంటే ఏ పని ముందుకు కదలదని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజా మద్దతు అవసరమని కోరారు. నీటిని సమర్దవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రంలో కరువు అనేదే ఉండదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications