గవర్నర్‌కు ఢిల్లీ పిలుపు: సెక్షన్8పై ఇప్పుడుకాదు, ఏడాదిగా డిమాండ్!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఆయన అత్యవసరంగా గురువారం నాడు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం పైన కేంద్రంతో చర్చంచనున్నారని తెలుస్తోంది.

ఓటుకు నోటు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల పైన ఆయన కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చించనున్నారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం హోంశాఖ అధికారులతో ఆయన భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సమన్వయపరచవలసి ఉంది. ఉదయం పది గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గవర్నర్ భేటీ కానున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ పెంచుతోంది. ఓటుకు నోటు పైన తెలంగాణ, ఫోన్ ట్యాపింగ్ పైన ఏపీ దూకుడు పెంచుతున్నాయి. మరోవైపు, సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ, వద్దని తెలంగాణ నేతలు చెబుతున్నారు.

Governor Narasimhan to Delhi today evening

సెక్షన్ 8 కోసం డిమాండ్ కొత్తదేం కాదు!

హైదరాబాదులో సెక్షన్ 8 అమలు కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఏడాది క్రితం కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. నిరుడు జూన్ 24వ తేదీన ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారని సమాచారం.

హైదరాబాదులోని సీమాంధ్రుల మనోభావాలు, భద్రతను పరిగణలోకి తీసుకొని విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రవేశ పెట్టాలని అందులో కోరారు. దీనిపై కేంద్రం కూడా స్పందించిందని సమాచారం.

విభజన చట్టం రూపొందే సమయంలో హైదరాబాదులో ఉంటున్న ఇతర ప్రాంతాల వారి ఆస్తులు, స్వేచ్ఛ, భద్రతకు సంబంధించి కేంద్రానికి వినతులు వచ్చాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలను అప్పగించిందని, సెక్షన్ 8 కింద రికార్డులు లేదా సమాచారం లేదా మంత్రివర్గ నిర్ణయాలకు సంబంధించి సమాచారం కోరే హక్కు గవర్నర్‌కు ఉందని, శాంతిభద్రతల నివేదిక కోరవచ్చునని, చట్టపరిధిలో ఆదేశాలు జారీ చేసే హక్కు గవర్నర్‌కు ఉంటుందని కేంద్రం కూడా లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ససేమీరా అంది. కేసీఆర్ మోడీకి లేఖ రాశారు. గవర్నర్‌కు అధికారాలు రాజ్యాంగం ప్రవచించిన స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.

మరోవైపు, సెక్షన్ 8 అమలుకు సంబంధఇంచి తనకు అనేక వినతులు వస్తున్నాయని, ఆపరేషనల్ గైడ్ లైన్స్ లేకుండా దానిని అమలు చేయలేమని, అందువల్ల రూల్స్ తయారు చేయాలని రాజ్ భవన్ పలుమార్లు కేంద్రాన్ని కోరిందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+