ఏపీ, టీ కలిస్తేనే శక్తి, బంధుత్వం పెరుగుతుంది: గవర్నర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే శక్తి ఉంటుందని గవర్నర్ నరసింహన్న అన్నారు. జలవిహార్‌లో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలయ్.. బలయ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. గత పదేళ్లుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలుగు ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్నారు. అలయ్ బలయ్‌తో బంధుత్వం పెరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తాము సహకరిస్తామని బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు వేణుగోపాల చారి, రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications