ఈసారి విజయం నాదే అంటున్న దివంగత వైఎస్ 'సోదరి'!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి పేర్ల గురించి పెద్దగా ప్రస్తావన అవసరంలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నంతకాలం వారి పేరు కూడా వినిపిస్తూనే ఉండేది. చరితారెడ్డిని వైఎస్ తన సొంత సోదరిలా భావించి రాజకీయంగా ప్రోత్సహించారు. 2004 ఎన్నికల్లో భాగంగా నందికొట్కూరు సీటు ఇప్పించి ఆమె విజయం సాధించేలా చూశారు. అలా దివంగత వైఎస్‌తో ఆ కుటుంబానికి అంతటి సాన్నిహిత్యం ఉండేది. వైఎస్ మృతిచెందిన తర్వాత ఆయన తనయుడు జగన్ వెంట నడిచారు.

పార్టీని బలోపేం చేశారు..
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప స్వతంత్ర అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి మీద విజయం సాధించారు. వైఎస్ జగన్‌కు అధికారం దక్కేవరకు, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేవరకు దంపతులిద్దరూ ఎంతో కృషిచేశారు. కానీ ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటినుంచే తర్వాత ఎన్నికల్లో సీటు లభిస్తుందా? లేదా? అనే సందేహం వారిలో మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసానికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 60,598 ఓట్లు తెచ్చుకోగలిగారు. ఆరుసార్లు నియోజకవర్గం నుంచి గెలిచిన చరిత్ర ఆయనది.

ఓటమి పాలైనప్పటికీ..
కాటసాని వైసీపీలో చేరడంతో 2019 ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కుతుందని చరితారెడ్డి భావించారు. దీంతో ఆమె ఆ పార్టీని వీడి 2019 మార్చి 9న తన భర్త వెంకటరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా, ఆయన సోదరిగా ఉండే చరితారెడ్డి టీడీపీలో చేరినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాటసానిని ఓడించాలనే పట్టుదలను కనపరుస్తున్నారు.

వ్యూహాలను రూపొందించుకుంటూ..
పాణ్యంలో బలమైన నేతగా ఉన్న కాటసానిని ఓడించడానికి అనువైన వ్యూహాలను, అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల చంద్రబాబు సమర్థత, వ్యక్తిగతంగా గౌరు వెంకటరెడ్డి, చరితారెడ్డికి ఉండే ప్రజాభిమానం లాంటి అంశాలన్నీ కలిసి ఈసారి తమను గెలిపిస్తాయని ఆమె నమ్ముతున్నారు. అందుకు తగ్గట్లుగా సీటుపై హామీ తీసుకొని ఇప్పటినుంచే నియోజకవర్గ మొత్త కలియతిరుగుతున్నారు. విజయానికి పునాది వేసుకుంటున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications