గౌతమ్ శాఖలు ఆ మంత్రులకే - ఆత్మకూరు టికెట్ పైనా : అసెంబ్లీ కంటే ముందే..!!

ఏపీ ప్రభుత్వంలో శాఖల కేటాయింపులు.. మార్పులు జరగబోతున్నాయా. హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలను ఎవరికి కేటాయిస్తారు. సీఎం తన వద్దే ఉంచుకుంటారా.. మంత్రులకు కేటాయిస్తారా..ఇప్పుడు ఈ చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్‌ నిర్వర్తించేవారు. ఇప్పటికే కేబినెట్ లో ఉన్న అందరు తమ శాఖల పనులతో బిజీగా ఉంటున్నారు. కొత్త శాఖలు..అందునా కీలకమైనవి కావటంతో ఎవరికి అప్పగిస్తారనే ఆసక్తి కరంగా మారుతోంది.

గౌతమ్ శాఖల పైన నిర్ణయం

గౌతమ్ శాఖల పైన నిర్ణయం

ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్‌ నిర్వర్తించేవారు. త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుందనే చర్చ సాగుతోంది. మార్చి 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాలు పూర్తయిన తరువాత విస్తరణ ఉంటుందని చెబుుతున్నారు. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. సమావేశాల్లో ఆ శాఖలకు సంబంధించిన సమాధానాలు చెప్పటానికి..చర్చల కోసం ముగ్గురు మంత్రులకు గౌతమ్ నిర్వహించిన అయిదు శాఖలను కేటాయించాలని నిర్ణయించారు.

ముగ్గురు మంత్రులకు కేటాయింపు

ముగ్గురు మంత్రులకు కేటాయింపు

మంత్రులు రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లకు గౌతమ్‌ చూసిన శాఖలను అదనపు పోర్టు ఫోలియోలుగా కేటాయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మాత్రమే వారు ఈ శాఖల పర్యవేక్షణ చేయనున్నారు. దీని పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.

ఇక, ఇప్పటికే గౌతమ్ ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపారు. ఇక్కడ ఉప ఎన్నికను ఆరు నెలల్లోగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10వ తేదీన వెల్లడికానున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత తరువాతి ఎన్నికల షెడ్యూల్ విడదలలో భాగంగా ఆత్మకూరుకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

Recommended Video

    Mekapati Goutham Reddy Funeral | Oneindia Telugu
    ఆత్మకూరు సీటు పైనా..

    ఆత్మకూరు సీటు పైనా..

    అయితే, గౌతమ్ రెడ్డి మంత్రిగా..సిట్టింగ్ ఎమ్మెల్యేగా హఠాన్మరణం చెందటంతో దాదాపుగా ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. పార్టీల నుంచి పోటీ ఉండే అవకాశం లేదు. అయితే, వైసీపీ నుంచి తిరిగి మేకపాటి కుటుంబానికే ఆత్మకూరు సీటు కేటాయించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మేకపాటి కుటుంబం ఇంకా గౌతమ్ హఠాన్మరణం షాక్ నుంచి తేరుకోలేదు.

    మరి కొంత సమయం తీసుకున్న తరువాత..మేకపాటి కుటుంబ సభ్యులతో చర్చించి..ఆ కుటుంబం నంచే ఒకరిని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే లోగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+