కేంద్రం కీలక నిర్ణయం.. ఆగస్టు 31 వరకు గడువు స్కీమ్ పొడిగింపు
రిటర్న్స్ దాఖలలో తలెత్తిన సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పన్ను పరిష్కార పథకం జీఎస్‌టీ ఆమ్నెస్టీ స్కీమ్ గడువును పొడిగించింది. చిన్న వ్యాపారాలు, ఫైనల్ జీఎస్‌టీ రిటర్న్స్ ఫైల్ చేయనివారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన పన్ను చెల్లింపుదారుల కోసం జీఎస్‌టీ ఆమ్నెస్టీ స్కీమ్ ను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
జీఎస్‌టీఆర్ 4, జీఎస్‌టీఆర్ 9, జీఎస్‌టీఆర్ 10 ఫైల్ చేయని వారికి జూన్ 30తో గడువు ముగిసినప్పటికీ ఆగస్టు 31, 2023 వరకు పొడిగించారు. డిసెంబర్ 31, 2022 కన్నా ముందు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన వ్యాపారులు వాటిని మరోసారి పునరుద్ధిరంచుకోవచ్చు. ప్రభుత్వం సూచించిన సమయంలోపు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేయనివారు, చేసుకున్నా రిజెక్ట్ అయిన వారు మళ్లీ రీవొకేషన్ కోసం అప్లై చేయొచ్చు. రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తేదీ వరకు ఉన్న అన్ని రిటర్న్స్ సమర్పించాలి. వడ్డీ, పెనాల్టీ, లేట్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది.

కాంపోజిషన్ స్కీమ్ కింద పన్ను చెల్లింపుదారులు ప్రతి త్రైమాసికానికి ఒకసారి GSTR-4 రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సాధారణ పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి ఒకసారి GSTR-9 రిటర్న్స్ ఫైల్ చేస్తారు. చెల్లించిన పన్నుల వివరాలను రిపోర్ట్ చేస్తారు. GST రిజిస్ట్రేషన్ రద్దు అయినప్పుడు లేదా సరెండర్ అయినప్పుడు GSTR-10 ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఫైనల్ రిటర్న్ అంటారు. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ రద్దయినా పన్ను చెల్లింపుదారులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ఆమ్నెస్టీ స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బకాయి పన్నులు, వడ్డీ, పెనాల్టీని చెల్లించిన తర్వాత ఆగస్టు 31 లోపు రద్దు అయిన రిజిస్ట్రేషన్ రివొకేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ కస్టమ్స్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications