రాజధాని లేకున్నా..ఆ విషయంలో తెలంగాణ కంటే ఏపీ ఒకింత ఎక్కువే ..!!

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 28 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జులై వసూళ్లతో పోల్చుకుంటే ఆగస్టులో రెవెన్యూ పెరిగింది. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 22 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు రికార్డయ్యాయి.

ఐజీఎస్టీ వాటా..

ఐజీఎస్టీ వాటా..


జులైలో జీఎస్టీ వసూళ్లు- 1,44,616 కోట్ల రూపాయలు. ఆగస్టులో ఆ సంఖ్య 1,43,612 కోట్ల రూపాయలకు తగ్గింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ సంఖ్య 28 శాతం అధికం. ఇందులో సీజీఎస్టీ వాటా 24,710 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 30,951 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 77,782 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. సెస్ రూపంలో అందిన మొత్తం 10,168 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 1,018 కోట్ల రూపాయలు ఇందులోనే కలిపారు.

ఏపీలో పెరుగుదల..

ఏపీలో పెరుగుదల..


కాగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా చోటు చేసుకున్నాయి. ఈ పెరుగుదల 22 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే ఆగస్టులో వచ్చిన జీఎస్టీ వసూళ్లు 2,591 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం అదే ఆగస్టు నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 3,173 కోట్ల రూపాయలకు పెరిగింది. తెలంగాణతో పోల్చుకుంటే 12 శాతం అధికంగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 10 శాతమే. హైదరాబాద్ వంటి ప్రధాన ఆదాయాన్ని అందించే నగరం లేనప్పటికీ.. ఏపీ మాత్రం తెలంగాణ కంటే అధికంగా జీఎస్టీ రెవెన్యూను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాష్ట్రాలవారీగా..

రాష్ట్రాలవారీగా..

రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.434 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.709 కోట్లు, పంజాబ్-రూ.1,651 కోట్లు, చండీగఢ్-రూ.179 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,094 కోట్లు, హర్యానా-రూ.6,772 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-4,349 కోట్లు, రాజస్థాన్-3,341 కోట్లు, ఉత్తర ప్రదేశ్-రూ.6,781 కోట్లు, బిహార్-రూ.1,271 కోట్లు, సిక్కిం-రూ.247 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.59 కోట్లు, నాగాలాండ్-రూ.38 కోట్లు, మణిపూర్-రూ.35 కోట్లు, మిజోరం-రూ.28 కోట్లు, త్రిపుర-రూ.56 కోట్లుగా నమోదయ్యాయి.

తెలంగాణలో..

తెలంగాణలో..

మేఘాలయ-రూ.119, అస్సాం-రూ.1,055 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,600 కోట్లు, జార్ఖండ్-రూ.2,595 కోట్లు, ఒడిశా-3,884 కోట్లు, ఛత్తీస్‌గఢ్-2,442 కోట్ల రూపాయల మేర జీఎస్టీ రెవెన్యూను అందుకున్నాయి. మధ్యప్రదేశ్-రూ.2,814 కోట్లు, దాద్రానగర్ హవేలి-రూ.310 కోట్లు, గుజరాత్-8,684 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.18,863 కోట్లు, కర్ణాటక-రూ.9,583 కోట్లు, గోవా-రూ.376 కోట్లు, కేరళ-రూ.2,036 కోట్లు, తమిళనాడు-రూ.8,386 కోట్లు, పుదుచ్చేరి-రూ.200 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.16 కోట్లు, తెలంగాణ-రూ.3,871 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+