మెగా హీరో కంటే పూనమ్ కౌర్ చాలా బెటర్..!!
Gudlavalleru College of Engineering: కృష్ణాజిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో మూడో కంటికి తెలియకుండా కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్‌లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, నినదాలతో ఇంజినీరింగ్ కళాశాల మార్మోగిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్‌కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తోన్నారు.
హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్‌సైట్లల్లో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తోన్నారు.
విద్యార్థుల నిరసన ప్రదర్శలకు సంబంధించిన వీడియోలు, కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్లుగా భావిస్తోన్న వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదుల్లోకి వెళ్లి.. వాళ్లను విచారించిన వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ దారుణ ఘటనపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. షాక్‌గా అభివర్ణించారు. నిందితులపై కఠిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే జోక్యం చేసుకోవాలని, బాధిత విద్యార్థినులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
"Outraged by the disturbing incident at a college in #Krishnadistrict, #AndhraPradesh! Requesting @yssharmila to take immediate action & ensure justice for the affected girls. Strict punishment must be given to those involved. #JusticeForGirls #SafetyInEducation" - #WomenSafety
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 30, 2024
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించారు. విద్యార్థినుల బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాలను పెట్టిన ఘటనలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దంటూ విజ్ఞప్తి చేశారు. వారికి శిక్ష పడేలా చేయాలని చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలకు పూనమ్ కౌర్ రిక్వెస్ట్ పెట్టారు.

ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్‌లో ఉందంటూ ఇదివరకు కామెంట్స్ చేసిన మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఈ ఉదంతంపై మాట్లాడకపోవడం, అదే సమయంలో పూనమ్ కౌర్ తెరమీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయి ధరమ్ తేజ్ కంటే పూనమ్ కౌర్ చాలా బెటర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం సంకీర్ణ కూటమి ప్రభుత్వం జనసేన భాగస్వామిగా ఉండటం, సొంత మేనమామ పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల ఏపీ సేఫ్ హ్యాండ్స్‌లో ఉందంటూ గతంలో పోస్ట్ పెట్టారు సాయి ధరం తేజ్. రాష్ట్రం సురక్షితంగా ఉంటుందంటూ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఉదంతం వెలుగులోకి రావడంతో నెటిజన్లు- అతన్ని నిలదీస్తోన్నారు. ఈ ఘటనపై స్పందించాలంటూ కొందరు మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు సైతం డిమాండ్ చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాష్ రూమ్‌లల్లో కెమెరాలను పెట్టడంపై వెంటనే స్పందించాలని, ఈ వివాదానికి తెర దించాలంటూ పట్టుబట్టారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications