బాబూ! సొల్లు వద్దు, దమ్కీలా? ఏపీకి కేంద్రం ఏమిచ్చిందంటే?: జీవీఎల్ నిప్పులు

న్యూఢిల్లీ/అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీది మహానాడు కాదని.. అది ఓ దగానాడు అని జీవీఎల్ ధ్వజమెత్తారు.

చంద్రబాబు దగాకోరు తనంతో బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్ నర్సింహారావు బుధవారం మీడియాతో మాట్లాడారు.

గుజరాత్‌కు 3వేల కోట్లిస్తే.. 98వేల కోట్లంటారా?

గుజరాత్‌కు 3వేల కోట్లిస్తే.. 98వేల కోట్లంటారా?

ఢిల్లీ-ముంబై కారిడార్ ప్రాంతంలో 2010-11లో 8 ఇండస్ట్రియల్ ఏరియాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగానే గుజరాత్ రాష్ట్రంలో డోలేరా అనే ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో నిర్మించేది కేపిటల్ కాదని, ఇండస్ట్రియల్ సిటీ అని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది అదొక్కటేనని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 54వేల కోట్లు ఇవ్వలేదని, కేవలం 2500-3వేల కోట్లు మాత్రమే ఇస్తోందని జీవీఎల్ చెప్పారు. ఈ మొత్తానికి స్పెషల్ పర్పస్ వెహికిల్ రాష్ట్రం ఇస్తోందని, ఇందులో కేంద్రం సగం వాటా ఉందని అన్నారు. కేంద్రం 98వేల కోట్ల రూపాయలు ఇస్తోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు.

బాబుకు మతిభ్రమించింది..

బాబుకు మతిభ్రమించింది..

చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, వారే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని జీవీఎల్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక దేశ వ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని జీవీఎల్ నర్సింహారావు చెప్పారు. ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లలో ఏపీని కూడా రాయించామని చెప్పారు. బెంగళూరు-ముంబై, చెన్నై-ముంబై, చెన్నై-విశాఖ, అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని చెప్పారు.

 ఏపీపై ప్రేమతోనే.. బీజేపీ ఇలా చేసింది...

ఏపీపై ప్రేమతోనే.. బీజేపీ ఇలా చేసింది...

చెన్నై-ముంబై కారిడార్లలో నెల్లూరులోని కృష్ణపట్నం కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. 12వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, 1600ఎకరాలను కేంద్రం ప్రస్తుతానికి తీసుకుందని చెప్పారు. గుజరాత్‌లోలాగే కృష్ణపట్నంకు కూడా 2500-3వేల కోట్ల నిధులను కేంద్రం అందిస్తుందని జీవీఎల్ తెలిపారు. 98వేల కోట్లను గుజరాత్‌కు కేంద్రం ఇచ్చిందంటూ అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.

విశాఖ-చెన్నై కారిడార్లోనూ విశాఖపట్నం, విజయవాడలను అభివృద్ధి చేస్తున్నామని జీవీఎల్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రానికి ఒక ఇండిస్ట్రియల్ సిటీ ఇస్తే.. ఏపీకి మూడు ఇచ్చామని చెప్పారు. ఈ నెలలోనే దీనిపై మీటింగ్ జరిగిందన్నారు. కేంద్రం పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 3 ఇండస్ట్రియల్ సిటీలను ఇవ్వలేదని, అది బీజేపీకి ఏపీ మీద ఉన్న ప్రేమ అని జీవీఎల్ చెప్పారు. కృష్ణపట్నం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. విశాఖ, విజయవాడ మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని అన్నారు. ఈ మూడు సిటీలతో లక్షలకోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

 కేంద్రం చేసింది చెప్పరు.. సొంతడబ్బానే..

కేంద్రం చేసింది చెప్పరు.. సొంతడబ్బానే..

చంద్రబాబు సొంత డబ్బు కొట్టుకోవడం తప్ప, కేంద్రం చేసింది చెప్పరని జీవీఎల్ మండిపడ్డారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోందని అన్నారు. ఏడాది కింద ఏం మాట్లతాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా సమితి ఛైర్మన్‌లా మాట్లాడుతున్నారని అన్నారు. సినిమా కాదని, మీకిష్టమైనట్లు ట్విస్టులు, టర్నులు తీసుకోవడానికి అని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హోదా కంటే ఎక్కువ సాధించామని చెప్పిన చంద్రబాబు.. యూసీలు మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.

సొల్లు వద్దు.. చంద్రబాబు అవినీతి పాలన ఇలా..

సొల్లు వద్దు.. చంద్రబాబు అవినీతి పాలన ఇలా..

చంద్రబాబు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఏపీలో అవినీతి జరుగుతోందని కాగ్ కూడా పేర్కొందని జీవీఎల్ గుర్తు చేశారు. తాము తినం, ఎవర్నీ తిననివ్వమని మోడీ ప్రమాణం చేసిన సమయంలోనే చెప్పారని జీవీఎల్ తెలిపారు.

అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంటే కేంద్రం చూస్తూ ఎలా ఊరుకుంటుందని ప్రశ్నించారు. కేంద్రం టీడీపీ పార్టీ ఫండ్ కోసం నిధులు ఇవ్వడం లేదని, ప్రజల కోసం ఇస్తుందని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని, ఆశాభంగం కావద్దని అన్నారు. బోలేరో సిటీ అంటూ దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై జీవీఎల్ మండిపడ్డారు. సర్దార్ విగ్రహానికి కేంద్రం ఇచ్చింది 3వేల కోట్లు కాదని, రూ. 300కోట్లు అని జీవీఎల్ స్పష్టం చేశారు. సొల్లు కబుర్లు చెప్పొద్దని, ఆధారాలతో రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు జీవీఎల్. చంద్రబాబు 420 వ్యవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 బాబూ దమ్కీలు ఇస్తున్నార?

బాబూ దమ్కీలు ఇస్తున్నార?

టీడీపీ ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమైందని, ప్రజలను పట్టించుకోవడం లేదని జీవీఎల్ అన్నారు. తాము ప్రజల్లోకి వెళుతున్నామని, టీడీపీని ఎండగడతామని అన్నారు. ఫోన్ రికార్డులు చూస్తే తెలుస్తుంది.. చంద్రబాబు అలయెన్స్ కోసం ఎంత తాపత్రయపడ్డారో అని అన్నారు. తప్పుడు పనులు చేయడం టీడీపీకి కొత్తేంకాదని అన్నారు. దేశంలో ఎవరు ఎవర్నైనా ప్రశ్నించవచ్చని.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం బాబును ప్రశ్నిస్తారా? అంటూ బెదిరిస్తున్నారని అన్నారు. దమ్కీలు ఏమైనా ఇస్తున్నారా? అని అన్నారు. ఏపీలో ప్రజా ప్రభుత్వం ఉదా? మాఫియా ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. ప్రస్ట్రేషన్ తోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోందని, ప్రజల్లోకి వెళ్లలేకి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు టీడీపీ బలహీనపడినప్పుడల్లా ఎన్టీఆర్ భజన చేస్తారని అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలతో కేంద్రానికి సంబంధం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+