వ్యక్తి ఆత్మహత్యాయత్నం: క్లబ్ యజమాని అరెస్టు
హైదరాబాద్: ఓ వ్యక్తి రాజభవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో పోలీసులు ఓ పేకాట క్లబ్ యజమానిని అరెస్టు చేశారు. ఫ్యామిలీ క్లబ్ పేరుతో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణపై అంకినీడు ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
పదేళ్లుగా జీవిఆర్ క్లబ్ పేరిట పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడనే ఆరోపణపై అంకినీడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పేకాట క్లబ్ కారణంగా దివాళా తీసిన వ్యక్తి శుక్రవారం రాజభనవ్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతను ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కర్నూలు జిల్లాలో ఆర్టీసి కండక్టర్‌గా పనిచేస్తూ సస్పెండ్ అయిన రాజేంద్ర కుమార్ (52)గా గుర్తించారు. పురుగుల మందు తాగి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం తొలుత యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
నగరంలో పేకాట క్లబ్‌లను మూసేయాలని డిమాండ్ చేస్తూ అతను ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్ర కుమార్ హైదరాబాదులోని నాచారంలో నివాసం ఉంటున్నాడు.












Click it and Unblock the Notifications