"పవన్ బిజెపితో ఉన్నారో లేదో తెలియదు, సమర్థిస్తున్నా"
న్యూఢిల్లీ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు సమర్థించారు. ప్రత్యేక హోదా స్థానంలో తగిన ప్రయోజనాలను రాష్ట్రానికి కల్పిస్తే అభ్యంతరం లేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
హోదాలో పేరులో ఏముందని, తగినట్లుగా సాయం చేాలని ఎవరు అన్నా తాను సమర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు పవన్ కల్యాణ్ బిజెపితో ఉన్నారో లేదో తనకు తెలియదని ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్‌ను సమర్థిస్తా....
ఎపికి నిధులు రావాలని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తానని హరిబాబు చెప్పారు. ఆ సహాయం చేయాలని తాము కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు ప్రత్యేక హోదాకు మారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏం కావాలో తేల్చుకోండి
ప్రత్యేక హోదా అనే పేరు కావాలని పట్టుబడుదామా లేదంటే ప్రత్యేక హోదా వల్ల లభించే ప్రయోజనాలతో కూడిన నిధులను రాబట్టుకుందామా అని హరిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను అడిగారు.

అరుణ జైట్లీ చెప్పారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాల ప్రయోజనాలనూ కల్పించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కంభంపాటి హరిబాబు చెప్పారు. రెవెన్యూ లోటుపై ఇప్పటికే రూ.4000 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన చెప్పారు. మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతూనే ఉన్నారని ఆయన అన్నారు.

చట్టంలో ఎందుకు పెట్టలేదు....
రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు పెట్టలేదని ఆయన కాంగ్రెసు పార్టీని ప్రశ్నించారు. దానికి కాంగ్రెసు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసుకు ఆంధ్రప్రదేశ్‌పై చిత్తశుద్ధి లేదని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications