అందుకే దూరం పెడ్తున్నారని హరికృష్ణ: ఎర్రబెల్లి సవాల్

ఎర్రబెల్లి సవాల్
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కాంగ్రెసు పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకుంటే తెలంగాణ ఏర్పాటు చేసే వాళ్లమని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరంలతో చెప్పించగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి భాగస్వామ్యముందన్నారు.
అన్ని పార్టీలు కలిసి సమన్యాయం చేయాలని తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోరారన్నారు. వారికి ఇచ్చిన వినతిపత్రాల్లో తెలంగాణను ఆపమని ఎప్పుడైనా కోరారా చెప్పాలన్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో కెసిఆర్ ఎప్పుడు పోరాడలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మంటే కెసిఆర్ తోకముడిచారన్నారు. టిటిడిపి ఫోరం నేతలు తెరాసకు ఓ లేఖ కూడా రాశారు.
కిరణ్‌కు జెసి సూచన
కిరణ్ కుమార్ రెడ్డితో సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. కొత్త పార్టీ పెట్టాలని కిరణ్ అలోచిస్తున్న నేపథ్యంలో పార్టీ పెట్టొదంటూ జెసి సూచించినట్లుగా తెలుస్తోంది. సమైక్య ఉద్యమం నాటి ప్రభావం ఇప్పుడు లేదని, సమైక్య ఛాంపియన్‌గా మీకున్న ఇమేజ్ ఇప్పుడు ఓట్లగా మారుతాయా? లేదా? అని ఆలోచించుకోవాలని కిరణ్‌కు హితబోధ చేశారట. సన్నిహితులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని జెసితో కిరణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
బైరెడ్డి దీక్ష
సీమాంధ్రకు రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. కర్నూలులోని జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం వద్ద ఆయన ఈరోజు ఉదయం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో కర్నూలు నుండి రాజధాని హైదరాబాదుకు మారిందన్నారు.
గతంలో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాదుకు మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు విభజన అనంతరం కర్నూలునే రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications