మా పరిధిలో లేదు: మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారణ
హైదరాబాద్: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో దాఖలైన పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వ్యాజ్యంపై తదుపరి విచారణను నవంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది. ఎన్‌కౌంటర్ ఒడిశా పరిధిలో జరిగిందని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు ఒడిశాలో ఎన్‌కౌంటర్ జరిగినందున తమ పరిధిలోకి రాదని హైకోర్టు పేర్కొంది.

ఎదురుకాల్పుల ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మృతి చెందిన మావోల మృతదేహాలను విశాఖ తరలించాలని కోరుతూ పిటిషనర్ ఈ మేరకు కోర్టును కోరారు. కాగా, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు.
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది, మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications