ఎపిలో ఎందుకు మూసేశారు: అంబేడ్కర్ వర్సిటీకి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ఏ చట్టం ప్రకారం నిలిపేశారని హైకోర్టు వర్శిటీ న్యాయవాదిని ప్రశ్నించింది. అలా నిలిపి వేయాలని వర్సిటీల చట్టంలో ఎక్కడుందో చూపాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం వర్సిటీ తరపు న్యాయవాదిని నిలదీసింది.
దేశంలోని ఒక రాష్ట్రంలో ఉన్న వర్సిటీలో మరో రాష్ర్టానికి చెందిన విద్యార్థులు విధ్యాభ్యాసం చేయడానికి అవకాశం లేదా? అదీ ఓపెన్ వర్సిటీలో ఇలాంటి ఆంక్షలేంటి? విద్యార్థులకు ఇచ్చిన అడ్మిషన్లు రద్దు చేయకుండా సేవలెలా నిలుపుదల చేస్తారు? ఇప్పటి వరకు అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అని కోర్టు ప్రశ్నించింది.

ఆ విధంగా నిలిపివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని హైకోర్టు అడిగింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు వర్సిటీ రిజిస్ర్టార్‌ను కోర్టుకు హాజరవ్వాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. ముఖ్యంగా ఎపిలో ప్రాంతీయ కేంద్రాలను ఎందుకు మూసేశారనే వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది సంజీవ్ కుమార్ వాదనలు వినిపించారు. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎపి పునర్వ్యస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉందనవి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏడాది పాటు సేవలు కొనసాగించిందని, ఆ తర్వాత సేవలు కొనసాగాలంటే ఎంఓయు కుదుర్చుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications