అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండోరోజూ వాడీవేడిగా రాజధానుల విచారణ-మరోసారి సీజే ప్రశాంత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన దాదాపు వందకు పైగా పిటిషన్లపై హైకోర్టులో వరుసగా రెండోరోజు విచారణ వాడీవేడిగా సాగింది. అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతుల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ ఇవాళ కూడా వాదనలు వినిపించారు. ఈ సందర్భఁగా జోక్యం చేసుకున్న హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని రైతుల తరఫున వాదిస్తున్న న్యాయవాది శ్యామ్ దివాన్ ఇవాళ తన వాదనలు కొనసాగించారు. అమరావతికి సంబంధించి పలు కీలక అంశాలను శ్యామ్ దివాన్ హైకోర్టు దృష్టికి తెచ్చారు రాజధాని అమరావతి కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని.. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి కోసం వెలకట్టలేని త్యాగాలు చేశారని తెలిపారు. రైతులకు ఇచ్చిన కౌలు సహా అన్ని హామీలు వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.

heated arguments on three capitals petitons in ap high court consecutive second day, cj key remarks

రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని రైతుల తరఫున వాదించిన న్యాయవాది శ్యామ్ దివాన్ ఇవాళ హైకోర్టును కోరారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. భూములు ఇచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసమని, కానీ రాజకీయ విద్వేషంతో అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్‌గా మార్చేసిందని శ్యామ్ దివాన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజధాని కోసం 30 వేల మంది రైతులు భూములిచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గుర్తు చేశారు.
రాజధాని కేవలం అమరావతి రైతుల కోసం కాదని, ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు రాజధాని అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం వారి వ్యక్తిగతం కాదని, యావత్ దేశం కోసమని సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం రైతుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా.. ఇవి పూర్తయ్యాక ప్రభుత్వం, ఇతరులు వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల కేసుల్ని త్వరగా తేల్చేస్తామని సీజే ప్రకటించారు.

English summary
andhrapradesh high court witnessed heated arguments on consecutive second day over petitions against three capitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X