AP Weather : రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ హెచ్చరికలు.
అల్ప పీడన ద్రోణి ప్రభావం కారణంగా ఇవాళ కూడా ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
అమరావతి : ఏపీలో రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ధ ప్రకటించింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎండ వేడిమికి అల్లాడుతున్న జనానికి కాస్త ఊరట లభించింది. రేపు కూడా పలు జిలాల్లో వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం తెలిపింది.
రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్ధ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు.

కోస్తాంధ్రలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్ధ కోరుతోంది. అలాగే పలు చోట్ల భారీ వర్షాలు, పిడుగుపాటు అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ డా.బిఆర్ అంబేద్కర్ ఇవాళ సూచించారు.












Click it and Unblock the Notifications