వీడని వర్షాలు, మరో సారి - తాజా హెచ్చరిక..!!
రాష్ట్రంలో వరదలు పలు ప్రాంతాల్లో భారీ నష్టం చేసాయి. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇదే సమయంలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. గత మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రావడం వల్ల మరో రోజు కూడా ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. తాజా హెచ్చరికలతో కోస్తా జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
విశాఖ వాతావరణ శాఖ మరో అప్డేడ్ ఇచ్చింది. రాగల 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక విదర్భ, తెలంగాణ ప్రాంతాలలో వాయుగుండం కొనసాగుతోందని తెలిపింది. రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరుకులో అత్యధికంగా 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 55 కిలోమీటర్లు వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈరోజు (సోమవారం) మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.












Click it and Unblock the Notifications