స్వర్ణపురిలో అను ఇమ్మానుయేల్ సందడి...భావపురిలో కూడా...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణ పురి-భావపురిల్లో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ సందడి చేసింది. వర్థమాన తార అయినా ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అను ఇమ్మానుయేల్ కు మంచి ఫాన్ ఫాలోయింగే ఏర్పడిందట. కారణం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసిలో హీరోయిన్ కావడమే...

ఇక ఈ స్వర్ణ పురి-భావపురి పేర్లు ఎప్పుడూ వినలేదే...అవెక్కడ ఉన్నాయనుకుంటున్నారా?...ప్రస్తుతం పొన్నూరుగా వ్యవహరిస్తున్నపట్టణమే గతంలో స్వర్ణ పురి...ఇక బాపట్ల పట్టణం ఒకప్పటి పేరే భావపురి...ఇక ఈ స్వర్ణ పురి-భావపురి పేర్లు దూరప్రాంతాల వారికి తెలియకపోయినా స్థానికంగా మాత్రం అందరికి సుపరిచితమే...పైగా ఈ పట్టణాల్లో ప్రారంభోత్సవాలకు క్రేజీ కధానాయికలు తరలిరావడం అత్యంత అరుదు కాబట్టి భారీ సంఖ్యలో అభిమానులు హీరోయిన్ అను ఇమ్మానుయేల్ ను చూసేందుకు తరలివచ్చారు.ఇక మళ్లీ మన కథనాయిక అను ఇమ్మానుయేల్ విషయానికొస్తే...ముందుగా పొన్నూరు పట్టణం జీబీసీ రోడ్‌లో మామిళ్లపల్లి బస్టాండ్ ఎదురుగా ఆమె బీన్యూ మొబైల్ సంస్థ 39 వ షోరూమ్‌ను అనూ ఇమ్మానుయేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అను మాట్లాడుతూ మల్టీ బ్రాండ్ మోబైల్ షోరూమ్‌ను ప్రారంభించడం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

Heroine anu emmanuel launches BNew Mobile showrooms

అనంతరం బాపట్ల పట్టణం జీబీసీ రోడ్‌లోని కొత్త బస్టాండ్ వద్ద బీన్యూ మొబైల్ సంస్థ 40వ షోరూమ్‌ను అను ఇమ్మానుయేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అను మాట్లాడుతూ బాపట్ల పేరుతాను విన్నానని, ఇప్పుడు చూస్తున్నానని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమాను ధియేటర్లలోనే చూడాలని , ఈ సినిమా అందరికి నచ్చుతుందని తెలిపింది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కావడంతో ఈమె రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆమెకు అభినందనలు తెలియ చేసారు. మజ్ను చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈమె , మొదటి చిత్రం తోనే యూత్ కు బాగా దగ్గరయింది. ఇక పవన్ కళ్యాణ్ ఛాన్స్ రావడం తో అమ్మడికి క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య తో నాగ చైతన్య సినిమాలో నటిస్తుంది.అలాగే బోయపాటి శ్రీను , రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం లో కూడా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heroine anu emmanuel launches BNew Mobile showrooms at ponnur and bapatla in andhra pradesh on january 9.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి