తమన్నా ఆస్తులు ఎంతో తెలుసా?
స్టార్ హీరోయిన్ తమన్నా గురించి, ఆమె సినిమాల గురించి అందరికి తెలుసు. పరిశ్రమలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కుర్ర హీరోయిన్ల తో పోటి పడుతూ వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగులో ఉన్న సీనియర్ హీరోలకు తమన్నా ఒక ఆప్షన్ గా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను ఈ అమ్మడు అక్షరాల పాటిస్తోంది. అందుకే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటోంది. చక్కగా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లతో సహా అన్నీ చేసుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా తమన్నా భాటియా ఎంత సంపాదిస్తుందో అనే ఆలోచన అందరికి కలిగింది.
ప్రస్తుతానికి తమన్నా ఆస్తుల విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుంది. ప్రతి నెలా ఆమె రూ.2 కోట్లు సంపాదిస్తున్నారు. రెమ్యునరేషన్ రూపంలోనే వస్తోంది. ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.7 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రకటనల్లో కూడా నటిస్తోంది. వాటినుంచి కూడా భారీగానే వెనకేసుకుంటోంది. ప్రతి యాడ్ కు తమన్నా రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకుంటోందనే వార్తలు వచ్చాయి. ప్రకటనలద్వారానే ఏడాదికి మంచి ఆదాయం గిట్టుబాటవుతోంది.

పెట్టుబడుల విషయానికి వచ్చినట్లయితే వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక ఆన్లైన్ జ్యువెలరీ స్టోర్ ను తమన్నా భాటియా నడిపిస్తోంది. అలాగే ముంబయిలోని వర్సోవ ఏరియాలో ఒక విలాసమైతమైన లగ్జరీ ఫ్లాట్ ను సొంతం చేసుకుంది. దీని విలువ దాదాపు 20 కోట్లు. ఆమె దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు ఈ అమ్మడు సొంతం. తెలుగు తో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా సినిమాలు చేస్తోంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. తాజాగా లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ విడుదలైంది. రెండుచేతులతో తమన్నా బాగానే సంపాదిస్తోందని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఆమె ఫాలోవర్స్ బాగా ఉన్నారు.












Click it and Unblock the Notifications