జగన్ బిగ్ డెసిషన్ - ముహూర్తం ఫిక్స్..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ - ప్రజల్లోనే ఉండాలని డిసైడయ్యారు. ఈ మేరకు కార్యాచరణ ఫిక్స్ చేసారు. జగన్ యూకే వెళ్లేందుకు తాజాగా హైకోర్టు నుంచి అనుమతి వచ్చింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయాలని అధికారులను న్యాయస్థా నం ఆదేశించింది. 16వ తేదీన యూకేలో జరగనున్న కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు జగన్ సతీ సమేతంగా హాజరు కానున్నారు. వస్తూనే ఇక.. జిల్లాల పర్యటనకు జగన్ షెడ్యూల్ ఖరారైంది.
కోర్టు అనుమతితో
మాజీ సీఎం జగన్ ఇక పార్టీ కేడర్ - ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించారు. తాజాగా జగన్ కు హైకోర్టులో రిలీఫ్ దక్కింది. జగన్ కు అయిదేళ్లు కాల పరిమితితో పాస్ పోర్టు మంజూరుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాను యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు నుంచి రిలీఫ్ దక్కటంతో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కు హాజరవుతారు. ఇప్పటికే జగన్ పలు జిల్లా లకు కొత్త అధ్యక్షులను నియమించారు. జిల్లా కమిటీల పైన నిర్ణయం తీసుకున్నారు.

జిల్లాల పర్యటన
లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఈ నెల 29వ తేదీ నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం అయ్యేలా ప్రాధమికంగా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. ఏదైనా కారణాలతో వాయిదా పడితే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ప్రతీ వారం రెండు రోజులు ఒక్కో జిల్లాలో సమీక్ష లు.. కార్యకర్తలతో మమేకం అయ్యేలా జగన్ ప్లాన్ ఫిక్స్ అయింది. జిల్లాలోని పార్టీ పరిస్థితులు.. గత ఎన్నికల వేళ కేడర్ తో వచ్చిన గ్యాప్ భర్తీ చేసుకొనేలా జగన్ తన టూర్ షెడ్యూల్ ఫైనల్ చేస్తున్నా రు. అదే సమయంలో రెండు రోజులు పూర్తిగా నియోజకవర్గాల వారీగా లీడర్లు - కేడర్ తో మమేకం అవ్వటం తో తిరిగి పార్టీలో జోష్ నింపాలని భావిస్తున్నారు.
ప్రజల్లోనే ఉండేలా
ప్రతీ వారం రెండు నుంచి మూడు రోజులు జిల్లాల పర్యటనల్లోనే ఉండేందుకు జగన్ సిద్దం అయ్యారు. అయితే, ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయి. ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం 26 జిల్లాల్లోనూ సమీక్షలు పూర్తయిన తరువాత.. ఇక, ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని జగన్ స్పష్టం చేసారు. ముందుగా కేడర్ కు అండగా ఉంటూ.. స్థానిక అంశాలు, ప్రభుత్వ వైఫల్యాల పైన జిల్లాల వారీగా కార్యక్రమాలు సిద్దం చేసుకోవాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే జనంలో ఉన్న స్పందన గురించి జగన్ పార్టీ నేతలకు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications