దారుణం: యువకుడి గొంతు కోసిన హిజ్రాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. బంగారు గొలుసు కోసం హిజ్రాలు ఓ వ్యక్తి గొంతు కోశారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు పూడేరు వాసి చిట్టిబాబుగా తెలుస్తోంది.

ప్రయాణికుడి నుంచి హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేశారు. అందుకు అతను నిరాకరించడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. దాంతో వారు అతని గొంతు కోశారు. దాంతో అతను రక్తం మడుగులో కుప్పకూలిపోయాడు. అతని వద్ద ఉన్న బంగారు గొలుసును ఎత్తుకుని వారు పరారయ్యారు.

Hijras chop man's throat in Nellore district

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అతన్నిమెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

క్వారీలో పడి చిన్నారులు మృతి

ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+