• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇళ్ల స్ధలాలు అడ్డుకునేవారు మనుషులేనా-దేవుడి మొట్టికాయలు- జగన్‌ కామెంట్స్‌

|

ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం జగన్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్నా అడ్డుకునే దుర్మార్గపు ఆలోచన ఇది అని ఇవాళ చిత్తూరు జిల్లాలో జరిగిన ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమంలో జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ఇస్తున్నా కోర్టు స్టేలు తీసుకొచ్చి అడ్డుకుంటున్నారని, చివరకు పులివెందులలో సైతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేని పరిస్ధితి వచ్చిందన్నారు. మిగిలిన చోట్ల ఇళ్ల పట్టాలు రాని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని జగన్‌ సూచించారు.

బిగ్‌బాస్ బ్యూటీ హాట్ ఫోటోలు.. కళ్లతోనే కవ్విస్తున్న నందినీ రాయ్

 చిత్తూరులో జగన్‌ ఇళ్ల పట్టాల పంపిణీ

చిత్తూరులో జగన్‌ ఇళ్ల పట్టాల పంపిణీ

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు, తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణం పనులను సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ ప్రారంభించారు. వైయస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల పనులను ప్రారంభించి, అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఊరందూరులో 167 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వైయస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్లలో 6,232 ప్లాట్లు ఉండగా, 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు కేటాయించారు. 465 ప్లాట్లు శ్రీకాళహస్తి రూరల్, 1468 ప్లాట్లు ఏర్పేడు రూరల్‌కు చెందిన పేదలకు కేటాయించారు.

 ఇళ్ల పట్టాలతో రాష్టమంతా పండుగ

ఇళ్ల పట్టాలతో రాష్టమంతా పండుగ

ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్‌.. ‘రాష్ట్రమంతా పండగ జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం పనుల మొదలుతో ప్రతి ఒక్కరి చిరునవ్వుతో ఈ పండగ కార్యక్రమం జరుగుతోంది. 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు, రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లతో పాటు, మరో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కట్టించి ఇస్తామని నీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను' అని వ్యాఖ్యానించారు. ఇక్కడ మార్కెట్‌ విలువ ఎంత ఉంటుంది అని వేదికపైకి రాకముందు కలెక్టర్‌ను అడిగితే ఆయన... పక్కనే లేఅవుట్‌ వేస్తున్నారు. అక్కడ రెండున్నర సెంట్ల భూమి రూ.18 లక్షలకు అమ్ముతున్నారని చెప్పారు. అంటే ఇక్కడ ఇస్తున్న ప్లాటు విలువ దాదాపు రూ.7 లక్షలు. అది ఇస్తుంటే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఇంత చేస్తున్న నాకు, దేవుడు ఇంకా ఏం ఇవ్వాలంటూ జగన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

 ఇళ్ల నిర్మాణానికి జగన్ మూడు ఆప్షన్లు

ఇళ్ల నిర్మాణానికి జగన్ మూడు ఆప్షన్లు

పేదలకు ఇళ్ల స్దలాలు ఇవ్వడమే కాదు అందులో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం జగన్ తెలిపారు. ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి ఆప్షన్ ప్రకారం ప్రభుత్వం చూపిన నమూనా ప్రకారం అవసరమైన, నాణ్యమైన నిర్మాణ సామాగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్‌ ఛార్జీలు మీ చేతికి ఇస్తాం. మీరు దగ్గరుండి ఇల్లు కట్టుకోవచ్చన్నారు. రెండో ఆప్షన్‌లో లబ్ధిదారుడు ఇంటి సామాగ్రి తెచ్చుకుంటానంటే, మీకే ఇస్తాం. మీరు తెచ్చుకుని కట్టుకోవచ్చు. పనులు పురోగతిని బట్టి దశల వారీగా డబ్బు మీ చేతికి ఇస్తారన్నారు. అలాగే మూడో ఆప్షన్లో లబ్ధిదారుడు ఇల్లు కట్టించి ఇవ్వమని కోరితే, ప్రభుత్వమే స్వయంగా కట్టి ఇస్తుంది. మీకు ఇక్కడ కట్టి చూపుతున్న మోడల్‌ హౌజ్‌ మాదిరిగా, నాణ్యమైన మెటేరియల్‌తో ఇల్లు కట్టించి ఇస్తామన్నారు.

 మానవత్వం లేదు. మొట్టికాయలు తప్పవు

మానవత్వం లేదు. మొట్టికాయలు తప్పవు

రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకోవడంపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వీరికి మానవత్వం ఉందా?వారు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులేనా అనిపిస్తుంది. దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. న్యాయం జరుగుతుంది. త్వరలోనే కోర్టులలో కేసులు పరిష్కారమై, మిగిలిపోయిన ఆ 3.74 లక్షల అక్క చెల్లెమ్మలకు కూడా త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అక్క చెల్లెమ్మలకు చెబుతున్నాను'అని జగన్ హామీ ఇచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమం చేసేందుకు అవకాశం ఇచ్చిన దేవుడికి జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేయాలని మనసారా కోరుకుంటూ, సెలవు తీసుకుంటున్నాను'.. అంటూ ప్రసంగం ముగించారు.

తేజస్వి మదివాడ అందం చూడతరమా? గుండెలదిరేలా హాట్ హాట్ ఫోటోషూట్

English summary
andhra pradesh chief miniser ys jagan has expressed his displeasure over hindrances with court stay orders to houses sites distribution in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X