జగన్ ఇంటిచుట్టూ ప్రదిక్షణలు: తన పోటీపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జరుగుతున్న మార్పులు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్చార్జిల మార్పు ప్రక్రియ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసిపి ఇన్చార్జిల మార్పు ప్రక్రియను చేపట్టి అవసరమైన చోట మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే ఒక జాబితా విడుదల చేయగా, రెండవ జాబితాకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 30 నియోజకవర్గాలలో మార్పులకు అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా వ్యవహరించిన వారు, కీలక నేతలుగా ఉన్న వారు కూడా ఈసారి తమ సీటును కోల్పోయే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది.

Hindupuram MP Gorantla Madhav sensational comments on his ticket

ఏపీలో వైసీపీ గెలుపే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ముందు 11 మందితో మొదటి జాబితా విడుదల చేసి, వైసిపి సిట్టింగులకు షాక్ ఇచ్చారు. ఇక తాజాగా రెండో జాబితాకు కసరత్తు చేస్తున్న క్రమంలో అనంతపురం జిల్లాలో కూడా మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు ఈసారి టిక్కెట్ లేనట్టేనని చర్చ జరుగుతుంది.

ఈ క్రమంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న ఆయన తన టికెట్ విషయంలో మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలలో తన పోటీపై స్పందించిన గోరంట్ల మాధవ్ తన సీటు విషయంలో సీఎం జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి సమయంలో తాను ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పలేనని పేర్కొన్నారు.

సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను సీఎం జగన్ నిర్ణయిస్తారని తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థుల జాబితా పై ఓ నిర్ణయం వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం సీఎం జగనే నిర్ణయిస్తారు.. నేనెలా చెబుతాను? అంటూ ఆయన మీడియాను ప్రశ్నించారు.

తాను రాజకీయాలలో ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేయనని ఎలా చెబుతానంటూ ప్రశ్నించిన గోరంట్ల మాధవ్ ఇప్పటివరకు తన సీటు విషయంపై చర్చ జరగలేదని, ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని అన్నారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+