Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లుడి దెబ్బకు అడ్రస్ లేకుండాపోయిన అంబటి రాంబాబు, పవన్ ను టార్గెట్ చేస్తే, ఇక్కడ ??

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ నాయకులు అడ్రస్ లేకుండాపోయారు. బయట కనపడితే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఎదురుకావడంతో వైసీపీ నాయకులు ఎక్కడికక్కడే సైలెంట్ అయిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెబ్బకు వైసీపీ నాయకుల కూసాలు కదిలిపోవడంతో ఏం చెయ్యాలో అర్థంకాక సతమతం అవుతున్నారు.

అయితే వైసీపీలోని కొందరు ప్రముఖలను ఓడించడానికి వారి కుటుంబ సభ్యులు ప్రచారం చెయ్యడం రెండు నెలల క్రితమే కలకలం రేపింది. కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసినా మా నాయకుడు జగన్ తో పాటు వైసీపీ కార్యకర్తలు మాకు అండగా ఉన్నారని వైసీపీ నాయకులు అనుకుని ఇంతకాం భ్రమలో ఉండిపోయారు. అయితే వైసీపీకి చెందిన కొందరు నాయకులను వారి కుటుంబ సభ్యులే ముంచేశారని స్పష్టంగా వెలుగు చూసింది.

His own son-in-law Dr Gautham campaigned to defeat YCP leader Ambati Rambabu

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేసిన అంబటి రాంబాబు తన నాలుకకు ఎముకలేదని ప్రతిపక్ష పార్టీ నాయకులను నోటికి వచ్చినట్లు తిట్టారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసున్న అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇక పవన్ కల్యాణ్ ను అయితే దత్తపుత్రుడు, తోక పార్టీ అధ్యక్షుడు, మూడు పెళ్లాల ముద్దుల మొగుడు అంటూ అంబటి రాంబాబు ఆయన నోటీదూల ప్రదర్శించారు.

అయితే అంబటి రాంబాబుకు ఆయన సొంత అల్లుడే రాజకీయంగా మొగుడు అయ్యాడు. అంబటి రాంబాబును ఓడించాని ఆయన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ ప్రజలకు మనవి చేశాడు. తన మామ అంబటి రాంబాబు అంత నీచుడని నా జీవితంలో నేను చూడలేదని, అతను ఓ దుర్మార్గుడు అని, శవాల మీద చిల్లర ఎరుకునే ధరిద్రుడు అని, ఇలాంటి నీఛుడు ఎమ్మెల్యేగా గెలవడానికి అనర్హుడు అని, అలాంటి వాడికి మీరు ఎలా ఓటు వేస్తారని అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ సత్తనపల్లె నియోజక వర్గం ప్రజలను ప్రశ్నించారు.

His own son-in-law Dr Gautham campaigned to defeat YCP leader Ambati Rambabu

జీవితంలో మీకు మంచి జరగాలి అని అనుకున్నా, మీ జీవితాలు బాగుపడాలి అన్నా మా మామ అంబటి రాంబాబుకు ఓటు వెయ్యకూడదని, నేను ప్రతిరోజు నిద్రలేచిన తరువాత అలాంటి ధరిద్రుడి ముఖం చూడకూడదు స్వామి అంటూ దేవుడిని వేడుకుంటానని, అందరి జీవితాలు నాశనం చెయ్యడానికే మామామ ఇంకా బతికి ఉన్నాడని ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఆరోపించాడు.

పచ్చి అపద్దాన్ని కూడా నిజం చేసే సత్తా అతనికి ఉందని డాక్టర్ గౌతమ్ వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి దానిని వీడియో తీసి ఎన్నికలకు ముందు విడుదల చేశారు. డాక్టర్ గౌతమ్ చెప్పినట్లే సత్తెనపల్లె ప్రజలు మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబును చిత్తుచిత్తుగా ఓడించేసి ఇంటికి పంపించారు. అంబటి రాంబాబు ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+