అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలి భారీ శిల్పాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని నేడు చంద్రబాబు ఆవిష్కరించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి
పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో సహా, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

శాఖమూరు పార్కులో 6.80 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అమరజీవి త్యాగ శిల్పం పేరుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని, అమరావతి ప్రాంతంలోని శాఖమూరు పార్కులో మొత్తం 6.80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
ప్రాజెక్ట్ లో తొలిదశ పనులు పూర్తి
ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ ను ఉపయోగించారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఈ ప్రాజెక్టుకు తొలిదశ పనులను పూర్తి చేసి శిల్పాన్ని ఆవిష్కరణ గావించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసిన తొలి భారీ శిల్పంగా ఈ విగ్రహం ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది.
చారిత్రక స్మారకంగా అమరజీవి విగ్రహం
ఈ ప్రాజెక్టు రెండవ దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుని చారిత్రక స్మారకంగా ఈ విగ్రహం నిలవనుంది. అమరావతి కేంద్రంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాడు ఆంద్ర రాష్ట్రం కోసం కృషి చేసిన మహనీయుడికి సరైన గుర్తింపును ఇచ్చారు.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్













Click it and Unblock the Notifications