హైటెక్ సిటీ బాబు సొత్తా, ఫోటోలకి ఫోజులిస్తున్నాడు: కెకె

హైటెక్ సిటీ నిర్మించిన భూములేమైనా బాబు సొత్తా అని ప్రశ్నించారు. ఈ భూములన్నీ తెలంగాణ భూములేనని బాబు గ్రహించాలని అన్నారు. హైదరాబాద్‌లో దోపిడీని కొనసాగించేందుకే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారని టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహా రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ 13ఏళ్ల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడుతోందని అన్నారు. సంపూర్ణ తెలంగాణాను టిఆర్‌ఎస్ కోరుకుంటోందని, ఎలాంటి పేచీలు పెట్టినా మళ్లీ ఉద్యమించడానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని నాయిని హెచ్చరించారు.
అసెంబ్లీ ప్రొరోగ్ వ్యవహారం రామాయణంలో పిడకల వేట కంటే చిన్న విషయమని, దానిని తాము పట్టించుకోబోమని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం వేరుగా అన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్ అయినా కాకపోయినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై నిర్ణీత వ్యవధిలో చర్చ జరిగినా జరగకపోయినా ఆ బిల్లును పార్లమెంటుకు పంపించే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయన్నారు. ఆర్టికల్ 371 డి, ప్రొరోగ్ ఆలోచనలన్నీ అవివేకపు, మూర్ఖత్వపు ఆలోచనలేనని, తెలంగాణ ఆగే ప్రసక్తే లేదని అన్నారు.
'భద్రాచలం తెలంగాణలో అంతర్భాగం' అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ముగింపు దశకు వచ్చిందని, సీమాంధ్ర పాలకులకు ఇంగిత జ్ఞానం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో విడిపోయిందని తెలుసుకుని శాంతియుతంగా విభజనకు సహకరించాలని, లేకుంటే కాల గర్భంలో కలిసి పోతారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌పై ఏ ఒక్క ఆంక్షనూ సహించబోమన్నారు.












Click it and Unblock the Notifications