విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేరాల బాటలో హైటెక్ చోరీలు చేసిన ఇంజనీర్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఉన్నత విద్యనభ్యసించి, మంచి కంపెనీలో పని చేస్తూ అప్పులపాలై నేరాల బాట పట్టిన హైటెక్ నిందితుడ్ని బెజవాడ పోలీసులు అరెస్టు చేశారు. హై టెక్నాలజీని ఉపయోగించుకుని చోరీలకు పాల్పడిన ఓ ఇంజనీరును విజయవాడ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు రూ. 20 లక్షల విలువ చేసే చోరీ సొత్తు రికవరీ చేసినట్లు పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు.

హైదరాబాద్ కాప్రా ఈసిఐఎల్‌కు చెందిన నడింపల్లి వినయ్‌కుమార్ (35) ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబిఏ ఫైనాన్స్ చదివి వివిధ కంపెనీల్లో పనిచేశాడు. అనంతరం ఓ కంపెనీ ప్రారంభించి అప్పులపాలయ్యాడు. కానూరులోని తులసీనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచే చోరీలు ప్రారంభించాడు.

hitech engineer arrested in theft case

విజయవాడలో 14, రాజమండ్రిలో మూడు కలిపి మొత్తం 17 చోరీలకు పాల్పడ్డాడు. దృష్టి సారించిన సిసిఎస్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 20లక్షలు విలువైన రెండు కార్లు, 100 గ్రాముల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుని కారుకు నెంబర్ మార్చిన స్టిక్కరింగ్ షాపు యజమాని కావేరి రత్నబాబును అరెస్టు చేశారు.

కాగా నిందితుడు ఉన్నత విద్యా నేపధ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు. ఈయన తండ్రి బ్యాంకు మేనేజర్‌గా పని చేసి రిటైర్డ్ అయి చనిపోయారు. తల్లి ప్రస్తుతం అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు కాగా వినయ్‌కుమార్ రెండో కుమారుడు. అన్న కేరళలోని స్పేస్ సెంటర్‌లో సైంటిస్ట్‌గా, తమ్ముడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. నిందితునికి భార్య, పిల్లలు ఉన్నారు.

English summary
An engineer, Nadimpalli Vinaykumar has been arrested by Vijayawada police in theft cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X