HMPV Virus: ఇండియాలో ఎంటరైన చైనా వైరస్.. వ్యాప్తి జరిగితే ఎదుర్కోగలమా? కొత్త ఆందోళన!
ప్రస్తుతం చైనాని వణికిస్తున్న హెచ్ఎం పివి వైరస్ భారతదేశానికి కూడా చేరుకుంది. మన దేశంలో బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. వారి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ ను ప్రైవేటు ల్యాబ్ లకు పంపించిన డాక్టర్లు వీరికి హెచ్ఎం పివి సోకినట్టుగా గుర్తించారు. దీంతో ఐసిఎంఆర్ కు సమాచారం ఇచ్చి వీరిని క్వారంటైన్ లో ఉంచారు.
హెచ్ఎంపీవీ వైరస్ పై కొత్త ఆందోళన
ప్రస్తుతం భారత దేశంలో నమోదైన రెండు చైనా వైరస్ కేసులు కూడా బెంగళూరులోనే నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. అయితే హెచ్ ఎం పి వి వైరస్ భారతదేశంలోకి ప్రవేశించడంతో ఇప్పుడు ప్రజల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలను కలిగించే ఈ వైరస్ ను తట్టుకోవడం, దానిని ఎదుర్కొని నిలబడడం సాధ్యమవుతుందా అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.

కరోనా ఇచ్చిన రోగాలతో పోరాటం చేస్తున్న ప్రజలు
ఇప్పటికే కరోనా మహమ్మారితో పోరాడి ప్రస్తుతం కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలతో పోరాటం సాగిస్తూనే ఉన్న ప్రజల వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఉన్న శారీరక బలం ప్రస్తుతం సగానికి పైగా మందిలో లేకుండా పోయింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకున్న రెమిడిసవీర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంతో నేటికీ దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ప్రజలలో గణనీయంగా తగ్గిన ఇమ్యూనిటీ.. ఈ వైరస్ వస్తే ఎలా ?
ఇక ఇప్పటికే కరోనా మహమ్మారి ఇచ్చిన అనారోగ్యాల నుంచి బయటపడని ప్రజలు ప్రస్తుతం వస్తున్న ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి కావలసిన శక్తి కూడా తమ వద్ద లేదని తెగ బాధపడుతున్నారు . ఈసారి మరి ఏదైనా వైరస్ దాడి చేస్తే పోరాడి బ్రతుకుతామా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భయం గుప్పిట్లో జనం
ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదిలోనే దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి తాలూకు విషాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకొని ఎంతోమంది హెచ్ఎంపీవి వైరస్ గురించి తెగ ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు.












Click it and Unblock the Notifications