క్షమాపణలు చెప్పిన హోంమంత్రి అనిత..ఎందుకంటే..?

ఏపీ శాసనమండలి సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ప్రశ్నలు, కోపాలు, క్షమాపణలతో పెద్దల సభ అధ్యాంతం రక్తికట్టించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మండలి సభలో రాష్ట్ర హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితరాజకీయాలు మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలపై సూటిగా సమాధానం చెప్పడంలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు. రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా హోంమంత్రి అనిత తాము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో తాము సభ నుంచి వాకౌట్ అవుతామని హెచ్చరించారు.

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్లు చేసిన దౌర్భాగ్యాలు, వాస్తవాలు సభలో వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ముంటే బొత్స నిల్చోవాలని, ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ఆమె వ్యాఖ్యానించారు. సభలో అనిత చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై శాసనమండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దమ్ము, ధైర్యం అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు హోంమంత్రి అనిత వెంటనే క్షమించాలని వేడుకోవడంతో చైర్మన్ శాంతించారు.

Home Minister Anita apologized for her comments in the Legislative Council

అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని హోం మంత్రి అనిత విమర్శించారు.దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు.. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్‌, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నాం. ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు.. వైకాపా హయాం నాటిది. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుందనే విషయాన్ని హోంమంత్రి అనిత గుర్తు చేశారు.

శాసనమండలిలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన హోంమంత్రి అనిత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+