మీతో తోలు తీయించుకోటానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు .. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు హోం మంత్రి కౌంటర్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి సుచరిత కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ పైన, ఏపీ ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు హోంమంత్రి సుచరిత తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ తోలు తీస్తానని హెచ్చరిస్తున్నాడు అని, ఇక్కడ ఎవరూ తోలు తీయించుకోవడానికి సిద్ధంగా లేరని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై ప్రజలకు పూర్తిగా క్లారిటీ ఉందని, పవన్ కళ్యాణ్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషపై ఆయనే తిరిగి ఆలోచన చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత హితవు పలికారు.

పవన్ వ్యాఖ్యలకు రివర్స్ పంచ్ ఇచ్చిన హోం మంత్రి
పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో నిలబడితే రెండు చోట్ల ప్రజలు ఆయనను తిరస్కరించారని ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ ఎన్ని చోట్ల నిలబడతారో ఆయనను ప్రజలు అంగీకరిస్తారో లేదో అంటూ ఎద్దేవా చేశారు. పోటీ చేసిన ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయిన పవన్ వైసిపి నేతలను ఏం చేస్తారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ కు నిలకడ లేదని, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలీదు అంటూ విమర్శించారు సుచరిత .

పవన్ ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో ?
పవన్ కళ్యాణ్ కి ఇప్పటికీ రాజకీయాలపై ఒక క్లారిటీ లేదని పేర్కొన్న సుచరిత ఒకసారి పవన్ కళ్యాణ్ లెఫ్టిస్టు అంటారని, మరోసారి బీజేపీతో భాగస్వామిని అంటారని ,ఇంకొకసారి టీడీపీతో వెళతాడని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మేకతోటి సుచరిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్ప పవన్ కళ్యాణ్ లో రాజకీయ పరిణతి లేదన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, జనసేన కు వచ్చిన ఒకటి, రెండు సీట్లు కలుపుకొని రెండు పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో ప్రజలందరికీ తెలుసని హోంమంత్రి మేకతోటి సుచరిత ఎద్దేవా చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఉన్నాయన్నది అక్కడే అర్థమైందని పేర్కొన్నారు సుచరిత.

ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ పై ఒక క్లారిటీ ఉంది
అంతేకాదు ప్రజలందరూ జనసేన పార్టీ తీరును, పవన్ కళ్యాణ్ తీరును గమనిస్తున్నారని, పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ప్రజలకు పూర్తిగా క్లారిటీ ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు తమ పాలన ఎలా ఉందో స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు హోంమంత్రి సుచరిత .అధికారంలోకి రావాలంటే పార్టీ విధి విధానాలను ప్రజలకు చెప్పాలని అసలు జనసేన పార్టీకి ఓ విధానమే లేదని మండిపడ్డారు. 2019 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మెరుగైన పాలన సాగిస్తున్నారని జగన్ సర్కార్ కు కితాబిచ్చారు.

నిన్న జగన్, వైసీపీ సర్కార్ కు పవన్ వార్నింగ్
నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు విషయం తెలిసిందే. నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ వైసిపి నేతలకు భయం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనను ఎంత తిడితే అంత బలపడతా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం సామాజిక కార్యకర్తలా పనిచేశానని రాజకీయం చేయలేదని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఇక ముందు రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తానంటూ వైసీపీ సర్కార్ కు సవాల్ విసిరారు. దాక్కున్న వారిని ఒక్కొక్కరిని లాక్కొచ్చి కొడతా, తోలు తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే హోం మంత్రి సుచరిత పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications