వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ను, హోదాపై చంద్రబాబును ఏకిపారేసిన హోంమంత్రి సుచరిత

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత టిడిపి అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ ఒప్పిస్తే బాగుండేదని ఆమె పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పై చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించాలని పేర్కొన్న హోంమంత్రి సుచరిత, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు చురకలంటించారు. చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.

ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు

ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు


తాజాగా చంద్రబాబు ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని , వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై మండిపడుతున్న వైసీపీ నేతలు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలని చెప్పింది నాడు చంద్రబాబే కదా అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఇక తాజాగా హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా చంద్రబాబు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా ను తాకట్టు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారు అని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శలు గుప్పించారు.

కేవలం రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు డ్రామాలు

కేవలం రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు డ్రామాలు

గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఏరోజు మాట్లాడలేదని, ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలు అంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చి దుర్వినియోగం చేశారని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. బీజేపీతో విడిపోయిన తర్వాత దొంగ దీక్షలు చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చంద్రబాబు చెప్పడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని హోంమంత్రి సుచరిత ఆరోపించారు.

అప్పుడు టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చెయ్యలేదో?

అప్పుడు టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చెయ్యలేదో?

గతంలో ప్యాకేజీ ఒప్పుకొని ప్రత్యేక హోదా చంద్రబాబు విస్మరించారని ఆమె చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సుచరిత వ్యాఖ్యానించారు. హోదా ఇచ్చేది లేదని ఆనాడు కేంద్రం స్పష్టం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదో చంద్రబాబు చెప్పాలని మేకతోటి సుచరిత ప్రశ్నించారు.

Recommended Video

Konijeti Roasaih : The Ajatshatru In Indian Politics | End Of An Era || Oneindia Telugu
ఆయన చెయ్యాల్సింది దీక్షలు కాదు.. కేంద్రంపై ఒత్తిడి అన్న సుచరిత

ఆయన చెయ్యాల్సింది దీక్షలు కాదు.. కేంద్రంపై ఒత్తిడి అన్న సుచరిత

ఇక పవన్ కళ్యాణ్ ఉక్కు దీక్ష పై మండిపడిన హోంమంత్రి సుచరిత పవన్ కళ్యాణ్ చేయాల్సింది దీక్షలు కాదని హితవు పలికారు. బీజేపీతో కలిసి పని చేస్తున్న పవన్ కళ్యాణ్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని మేకతోటి సుచరిత పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కు తీసుకోవాలని అసెంబ్లీలో తాము తీర్మానం చేశామని, పోరాటాలు చేసే పవన్ కళ్యాణ్ పీఎం నరేంద్ర మోడీతో మాట్లాడి ప్రైవేటీకరణను ఆపితే సంతోషిస్తామని మంత్రి మేకతోటి సుచరిత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. అటు చంద్రబాబును, ఇటు పవన్ కళ్యాణ్ ను హోంమంత్రి సుచరిత ఏకిపారేశారు.

English summary
Home Minister Sucharitha slams Pawan Kalyan on Visakhapatnam steel and Chandrababu on ap special status. She asked pawan kalyan to convice modi on steel plant issue, and fires on Chandrababu in the matter of special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X