విజయవాడ దుర్గా అగ్రహారంలో దారుణం-పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో నరికి హత్య
విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నగరంలోని దుర్గా అగ్రహారంలో ఇవాళ ఓ యువకుడిని పలువురు ఆగంతకులు పట్టపగలే బైక్‌లపై వచ్చి నరికి చంపారు. దీంతో స్ధానికంగా ప్రజలు భయభ్రాంతులయ్యారు. మృతుడి వివరాల ఆధారంగా హంతకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు.
విజయవాడ దుర్గా అగ్రహారంలో పట్టపగలే ఆగంతకులు చెలరేగిపోయారు. స్ధానికంగా ఉండే ఓ వ్యక్తిని రోడ్డుపై ఆపి అతి దారుణంగా కత్తులతో నరికి చంపారు. ఆగంతకుల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో వారు వదిలి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు రంగంలకి దిగారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే స్ధానికంగా ఉన్న షాపులు, రోడ్లపై ఉన్నసీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరిస్తున్నారు.

విజయవాడ నగరం చాలా కాలంగా నేరాలు తగ్గుముఖం పట్టడంతో జనం ప్రశాంతంగా నివసిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ఉండగా.. తాజాగా వాటిని ఎత్తేశారు. దీంతో నిందితులు పక్కా ప్లాన్‌తోనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాతకక్షలే ఈ దారుణ హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితుల్ని పట్టుకునేందుకు నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిందితులు నగరం విడిచి పారిపోకుండా గాలింపు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications