సైకో భర్త.. భార్య చేతులు కట్టేసి బెల్టుతో చావబాది..

రాను రాను భార్యాభర్తల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. భర్తలను లేపేస్తున్న భార్యలు ఓవైపు.. భార్యలను చిత్ర హింసలు పెడుతున్న భర్తలు మరోవైపు కనిపిస్తున్నారు. తాజాగా ఓ శాడిస్టు, సైకో భర్త.. కట్టుకున్న భార్యపై దాష్టీకానికి పాల్పడ్డాడు. భార్యను కట్టేసి కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకు చిత్రహింసలు పెట్టాడు ఆ సైకో భర్త. భార్య రెండు చేతులు కట్టేసి చావబాదిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలు అయిన భాగ్యలక్ష్మికి తన దగ్గర బంధువైన బాలాజీతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచుగా తీవ్రంగా హింసించేవాడు. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్ లో ఉంటున్నాడు బాలాజీ. ఇక భాగ్యలక్ష్మి ఒంటరిగా ఉంటూ స్థానిక బేకరీలో పని చేస్తూ పిల్లలను చదివిస్తోంది.

Horror in Prakasam Husband Ties and Beats Wife to Death in SC Colony

అయితే అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు బాలాజీ. అలా భార్య సంపాదించుకుని దాచి పెట్టుకున్న డబ్బుల్ని దౌర్జన్యంగా తీసుకొని వెళ్లేవాడు. ఈ క్రమంలోనే మరోసారి ఇంటికి వచ్చిన బాలాజీ.. భార్యను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బాలాజీ, తన కుటుంబ సభ్యులు, మరో మహిళతో కలిసి భాగ్యలక్ష్మిని కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. తాళ్లతో ఆమెను బంధించి నోట్లో గుడ్డలు కుక్కి.. బెల్టు, కర్రలతో చితకబాదాడు. అంతేకాక ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అలా రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు తీవ్రంగా హింసించాడు. అయితే ఎట్టకేలకు భాగ్యలక్ష్మిని స్థానికులు కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు బాలాజీతో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+