శివరాత్రికి ముందే భానుడి భగభగ... తెలుగురాష్ట్రాల్లో ఎండల తాజా పరిస్థితి ఇలా!!

సహజంగా ఎప్పుడైనా శివరాత్రి తర్వాత చలి శివ శివ అంటూ వెళ్ళిపోతుందని, ఎండాకాలం మొదలవుతుందని చాలామంది పెద్దలు చెబుతుంటారు. కానీ ఈసారి శివరాత్రి కంటే ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి తొలి వారంలోనే ఊహించని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా సగటు ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

అప్పుడే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతుండడం, 39 డిగ్రీలకు చేరుకోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈసారి ఎండాకాలం విపరీతంగా ఉంటుందని, మార్చి నెల నుంచి రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి వేసవిలో ప్రతి సంవత్సరం నమోదైన పగలు సగటు ఉష్ణోగ్రతల కన్నా ఐదు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

hot summer before Shivratri This is the latest condition of summer temperatures

గత కొన్నిఏళ్ళ నుంచి సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని గుర్తించిన అధికారులు గత ఏడాది అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదయిందని పేర్కొన్నారు. అయితే ఈసారి అంతకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ ఉష్ణతాపం పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని, ఎండ మండుతుంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు 40 డిగ్రీలు దాటనున్న పరిస్థితులు ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎండాకాలం ఎండలకు పని ఎలా చూసుకోవాలి అని ఆందోళన పడుతున్నారు.

ఇప్పటికే ఎండల దెబ్బకు తాళలేకపోతున్నామని విలవిలలాడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉష్ణోగ్రతల పరిస్థితి మరో ఐదు రోజుల పాటు ఇలాగే ఉంటుందని, ఒకటి రెండు వారాలలో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు.. ఆ పైన కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం గతేడాది మార్చి నెలలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఈసారి మార్చి 3వ తేదీన 37 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎండలను తట్టుకోవాలంటే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+